త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Theenmar Mallanna | ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు పూర్తి మ‌ద్ద‌తిస్తున్నా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

MLC Theenmar Mallanna | ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC strike) కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Theenmar Mallanna) సంపూర్ణ మద్దతు (Support) ప్ర‌క‌టించారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

S

News | Published On Apr 19, 2026, 1.50 pm IST

MLC Theenmar Mallanna | ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు పూర్తి మ‌ద్ద‌తిస్తున్నా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC strike) కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Theenmar Mallanna) సంపూర్ణ మద్దతు (Support) ప్ర‌క‌టించారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించి మద్దతు కోరారు. వెంటనే స్పందించిన మల్లన్న వారి పోరాటానికి అండగా నిలుస్తామని, సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ల‌నున్నారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయొద్ద‌ని, జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపు, సేవా నిబంధనల మెరుగుదల వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల‌క్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ప్రైవేట్ వ్యవస్థ జోక్యం పెరుగుతుందని.. దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మల్లన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి వెంట నిలబడి పోరాటం కొనసాగిస్తుందని మల్లన్న వెల్లడించారు. “కార్మికుల హక్కుల కోసం జరిగే ఈ సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement