త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | ఇద్ద‌రు ఐఏఎస్‌ల‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

High Court | స‌మాచార హ‌క్కు చ‌ట్టం (RTI) కింద స‌మాచారం అందించాల‌ని హైకోర్టు (High Court) ఆదేశించిన‌ప్ప‌టికీ స‌మాచారం అందించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారులు న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నోటీసులు (Notices) జారీ చేసింది

A

News | Published On Dec 11, 2025, 2.45 pm IST

High Court | ఇద్ద‌రు ఐఏఎస్‌ల‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
Advertisement

High Court | హైకోర్టు (High Court) ఆదేశాలు ఉన్నప్ప‌టికి ఆర్టీఐ (RTI) చట్టం కింద సమాచారం అందజేయలేదని మాజీ జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్‌ల‌కు తెలంగాణ (Telangana) హైకోర్టు నోటీసులు (Notices) జారీ చేసింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్రకారం తాను అడిగిన సమాచారం అందజేయాలని గ‌త నెల‌ 24న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అధికారులు పట్టించుకోలేదని వడ్డం శ్యామ్ అనే వ్యక్తి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు విచారిస్తూ, కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని న్యాయమూర్తి నగేష్ భీమపాక ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. లేనిప‌క్షంలో వారి అఫిడవిట్లు స్వీకరించబోమని, రూ.10,000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement