త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పోలీసుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రించండి

పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారు.

a

News | Published On Dec 29, 2025, 1.24 pm IST

Harish Rao | పోలీసుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రించండి

సంక్షిప్త సారాంశం

ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారు. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయి. కానీ నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

[video width="1920" height="1080" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-29-at-12.52.34-1.mp4"][/video]

పోలీసుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రించండి : స‌భ‌లో హ‌రీశ్ రావు

త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ స‌మావేశాల్లో తొలిరోజు సోమ‌వారం నాడు బీఆర్ ఎస్ స‌భ్యుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌స్య‌ల‌పై పాల‌క ప‌క్షాన్ని నిల‌దీశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

👉🏿 జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్లీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందించాలి. గతంలో BRS ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపించింది.కొత్త సభ్యులు మాట్లాడుతుంటే జీరో అవర్ కాస్తా అరణ్యరోదనగా మారుతోంది. అలా మార్చకండి.

👉🏿 ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారు. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయి. కానీ నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పిఆర్సి ఇవ్వలేదు. వెంటనే పిఆర్సి విడుదల చేయాలని కోరుతున్నాను.

👉🏿 గతంలో కేసీఆర్ గారు 43 శాతం, 39 శాతం పీఆర్సీ అందించారు. ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ జీవోను కూడా ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఈహెచ్ఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ అమలు చేయలేదు. రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించారు. మా హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే అందరికీ టైంకి డబ్బులు అందించాం.

👉🏿 నేను అసెంబ్లీకి వస్తుంటే సిద్దిపేట నుండి రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి కలిశారు. అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. 35 ఏళ్లు సేవ చేసిన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

👉🏿 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా అతీగతీ లేదు. సీపీఎస్ కింద ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను రెండేళ్ల నుంచి దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

👉🏿 పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారు. కానిస్టేబుళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య భద్రత పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అందేలా చూడాలి.

👉🏿 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తక్షణమే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు, బకాయిలు ఇస్తామని, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారు. కానీ రెండేళ్లయినా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాను.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement