త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC | ఇక ఓఆర్ఆర్‌ లోపలే సిటీ బస్సులు.. సిబ్బంది జిల్లా డిపోల‌కు!

RTC | ఇక సిటీ బస్సులు ఔట‌ర్ రింగ్ రోడ్డు (ORR) లోప‌లే తిరగ‌నున్నాయి. రానున్న రోజుల్లో హైద‌రాబాద్ (Hyderabad) లో మొత్తం ఎల‌క్ట్రిక్ బ‌స్సు(Electric busses) లే ప్ర‌యాణికుల‌ను చేర‌వేస్తాయి. ఈ నేప‌థ్యంలో డీజిల్ బస్సుల్లో ప‌ని చేస్తున్న సిబ్బందిని జిల్లా డిపోల‌కు త‌ర‌లించేందుకు ఆర్టీసీ (RTC) ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అద్దె భత్యం, ప్రత్యేక నగర పరిహార భత్యం (సీసీఏ) భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం.

S

News | Published On Mar 28, 2026, 3.17 pm IST

RTC | ఇక ఓఆర్ఆర్‌ లోపలే సిటీ బస్సులు.. సిబ్బంది జిల్లా డిపోల‌కు!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇక సిటీ బస్సులు ఔట‌ర్ రింగ్ రోడ్డు (ORR) లోప‌లే తిరగ‌నున్నాయి. రానున్న రోజుల్లో హైద‌రాబాద్ (Hyderabad) లో మొత్తం ఎల‌క్ట్రిక్ బ‌స్సు(Electric busses) లే ప్ర‌యాణికుల‌ను చేర‌వేస్తాయి. ఈ నేప‌థ్యంలో డీజిల్ బస్సుల్లో ప‌ని చేస్తున్న సిబ్బందిని జిల్లా డిపోల‌కు త‌ర‌లించేందుకు ఆర్టీసీ (RTC) ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. కాగా సిబ్బంది బ‌దిలీలో కండ‌క్ట‌ర్ల‌ను మిన‌హాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నగరంలోని సిబ్బందికి ఇచ్చే అధిక అద్దె భ‌త్యం (HRA), సీసీఏ భారం తగ్గించుకునే యోచ‌న‌లో ఆర్టీసీ ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో దాదాపు 8000 మంది ఉద్యోగుల్లో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది.

హైదరాబాద్ నగరం నుంచి 30–50 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు తిరుగుతున్న సిటీ బస్సులను జిల్లా డిపోలకు తరలించ‌నున్నారు. సదరు సిబ్బందిని కూడా జిల్లా డిపోలకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియను ఇప్పటి నుంచే మొదలు పెట్టేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. గ్రేటర్ నగర డిపోల్లో పనిచేసే ఆర్టీసీ సిబ్బందికి, జిల్లా డిపోల్లో పనిచేసే సిబ్బంది కంటే ఎక్కువ అద్దె భత్యం, ప్రత్యేక నగర పరిహార భత్యం (సీసీఏ) ఉంది. ఆర్టీసీ ఈ భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిరసనలు కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో శ‌నివారం ర‌వాణా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ దీనిపై అసెంబ్లీలో మాట్లాడారు. డిపోల ప్రైవేటీక‌ర‌ణ అనేది పూర్తిగా అవాస్త‌వ‌మ‌న్నారు. ఎల‌క్ట్రిక్ బస్సుల ద్వారా వ‌చ్చే ఆదాయం సైతం సంస్థ‌కే వెళ్తుంద‌ని తెలిపారు. ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ నివేదిక ఇంకా త‌మ‌కు అంద‌లేద‌ని వివ‌రించారు. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొల‌గించ‌మ‌ని పొన్నం స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement