త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Andhra Pradesh | ఏపీలో ఇక‌పై ఆరు జోన్లు

Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) లోని 26 జిల్లాల‌ను ఆరు జోన్లు (Zone), రెండు మ‌ల్టీ జోన్లు (Multi Zone) గా కేంద్ర‌ప్ర‌భుత్వం (Central Government) విభ‌జించింది. ఈ మేర‌కు ఏపీ ప‌బ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డ‌ర్ 2025 పేరుతో గెజిట్ విడుద‌ల చేసింది.

A

News | Published On Dec 17, 2025, 4.39 pm IST

Andhra Pradesh | ఏపీలో ఇక‌పై ఆరు జోన్లు
Advertisement

Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) లోని 26 జిల్లాల‌ను ఆరు జోన్లు (Zone), రెండు మ‌ల్టీ జోన్లు (Multi Zone) గా కేంద్ర‌ప్ర‌భుత్వం (Central Government) విభ‌జించింది. ఈ మేర‌కు ఏపీ ప‌బ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డ‌ర్ 2025 పేరుతో గెజిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌బ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డ‌ర్ 1975ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నూత‌న గెజిట్ ప్ర‌కారం ఉద్యోగ నియామ‌కాల‌లో స్థానిక‌త‌, స్థానికేత‌ర‌, జిల్లా, జోన‌ల్‌, మ‌ల్టీ జోన‌ల్‌, రాష్ట్ర స్థాయి పోస్టుల‌ను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునేందుకు 27 నెల‌ల స‌మ‌యం ఇచ్చింది.

జోన్‌, మ‌ల్టీజోన్‌ల వివ‌రాలు...

  • జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విజ‌య‌న‌గ‌రం, అనకాపల్లి
  • జోన్-2: అల్లూరి సీతారామ‌రాజు, తూర్పు గోదావ‌రి, కాకినాడ, కోనసీమ
  • జోన్-3: పశ్చిమ గోదావ‌రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌
  • జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
  • జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
  • జోన్-6: కర్నూలు, నంద్యాల, అనంత‌పురం, సత్యసాయి
  • మల్టీజోన్-1: జోన్-1, 2, 3
  • మల్టీజోన్-2: జోన్-4, 5, 6
Advertisement

తాజావార్తలు

Advertisement