Haq OTT | ఓటీటీలోకి ఓజీ విలన్ కోర్టు రూమ్ డ్రామా మూవీ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్
ఇమ్రాన్ హష్మీ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ హక్ జనవరి 2న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించింది.
Haq OTT బాలీవుడ్ హీరో, ఓజీ ఫేమ్ ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన హక్ మూవీ థియేటర్లలో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కమర్షియల్‌గా మాత్రం ఈ కోర్ట్‌రూమ్ డ్రామా సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో వహించిన ఈ బాలీవుడ్ మూవీలో యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించింది.ఈ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ ఓటీటీలోకి వస్తుంది. జనవరి 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
వాస్తవ ఘటనలతో...
1985లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ ష బానో బేగం కేసు ఆధారంగా హక్ మూవీ రూపొందింది. కాన్సెప్ట్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ఆడియెన్స్ పేర్కొన్నారు. నిర్మాతలకు మాత్రం ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హక్ 28 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. ట్రిపుల్ తలాక్ చట్టం రాకముందు ముస్లిం మహిళల పరిస్థితి ఎలా ఉండేది? ఈ చట్టం వారి జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందన్నది ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. హక్ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో ఇమ్రాన్ హష్మీ నటించాడు.
హక్ మూవీ కథ ఏంటంటే?
మహ్మద్ అబ్బాస్ ఖాన్ (ఇమ్రాన్ హష్మీ) ఓ లాయర్. భార్య షాజియా బానో, ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా వారి జీవితం సాగిపోతుంది. ఓ రోజు ప్రియురాలు సైరా జహాన్‌ను ఇంటికి తీసుకొస్తాడు అబ్బాస్ ఖాన్. అడ్డు చెప్పిన షాజియా బానోకు ట్రిపుల్ తలాక్ చెబుతాడు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది షాజియా బానో. ఈ కేసులో కోర్టు ఆమెకు ఎలాంటి న్యాయం చేసింది? స్వతహాగా లాయర్ అయిన అబ్బాస్ ఖాన్ కోర్టులో ఎలా వాదించాడు? అన్నదే ఈ మూవీ కథ. హక్ మూవీలో వర్తిక సింగ్, దానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో కనిపించారు. హక్ మూవీని దర్శకత్వం వహించిన సుపర్ణ్ వర్మ గతంలో ఫ్యామిలీ మ్యాన్‌తో పాటు రానా నాయుడు వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



