Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌లో కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్ చేస్తోంది. అయితే సినిమాలో కాదు...ఓ వెబ్‌సిరీస్‌లో...ఆ సిరీస్ ఏది...ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On May 8, 2026, 3.41 pm IST
Keerthy Suresh | తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ రోల్స్‌లోనే కనిపించింది మహానటి కీర్తి సురేష్. ట్రెడిషనల్, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఫస్ట్ టైమ్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి కనిపించబోతుంది. అయితే సినిమాలో కాదు. ఓ వెబ్‌సిరీస్‌లో... అది కూడా బాలీవుడ్‌లో . కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో హిందీలో అక్క పేరుతో పీరియాడికల్ యాక్షన్ డ్రామా వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
గత ఏడాది అక్క షూటింగ్ మొదలైంది. సైలెంట్‌గా ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను కీర్తి సురేష్ కంప్లీట్ చేసిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరినట్లు సమాచారం. జూన్‌లోనే ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలొస్తున్నాయి. జూన్ రెండు లేదా మూడో వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
పేర్నూర్ అనే ప్రాంతంలో మహిళలే అధిపత్యం. ఆ ప్రాంతాన్ని తరతరాలుగా మహిళా నాయకులు ఎలుతుంటారు. కుట్రలతో పేర్నూర్‌ను ఆక్రమించుకోవాలని మరో లేడీ డాన్ ఎత్తులు వేస్తుంది. ఆమె కుట్రలను అక్క అనే గ్యాంగ్‌స్టర్ ఎలా ఎదురించింది? ఈ పోరాటంలో ఆమెకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో నటిస్తున్నట్లు చెబుతోన్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్, లుక్ విభిన్నంగా ఉంటాయట. కీర్తి సురేష్‌పై తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని మేకర్స్ అంటున్నారు. కీర్తి సాఫ్ట్ ఇమేజ్‌ను ఈ సిరీస్ బ్రేక్ చేస్తుందని చెబుతోన్నారు.
మోడ్రన్ లుక్‌లో...
కీర్తి సురేష్ రోల్ రా అండ్ రస్టిక్‌గా సాగితే...రాధికా ఆప్టే మాత్రం మోడ్రన్ లుక్‌లో కనిపిస్తుందని అంటున్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్‌లో నటిస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన సినిమా చేస్తోంది కీర్తి సురేష్. తమిళంలో సత్యవన్ సావిత్రితో పాటు బాలీవుడ్‌లోనూ రాఫ్తార్ సినిమాలతో బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



