Soya Chunks | ఈగల ముసురులో మీల్ మేకర్ తయారీ.. తింటే ఆస్పత్రి పాలే..!
Soya Chunks | నాన్ వెజ్ తినలేని వారు మీల్ మేకర్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరైతే ఇష్టంగా ఆరిగస్తుంటారు. అయితే వెజ్ లవర్స్ వీక్‌నెస్‌ను సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. అపరిశుభ్ర వాతావరణంలో ఈగల ముసురులో మీల్ మేకర్ తయారు చేస్తున్నారు.
Soya Chunks | త్రినేత్ర.న్యూస్ : నాన్ వెజ్ తినలేని వారు మీల్ మేకర్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరైతే ఇష్టంగా ఆరిగస్తుంటారు. అయితే వెజ్ లవర్స్ వీక్‌నెస్‌ను సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. అపరిశుభ్ర వాతావరణంలో ఈగల ముసురులో మీల్ మేకర్ తయారు చేస్తున్నారు. హెచ్ ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ నిర్లక్ష్యం బయటపడింది.
హైదరాబాద్ నగర పరిధిలోని జల్‌పల్లిలో ఉర్వి ఫుడ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ మీల్ మేకర్‌ను తయారు చేస్తుంది. ఈ నెల 28న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, అత్యంత అధ్వాన్నమైన, అపరిశుభ్ర వాతావరణంలో వాటిని తయారు చేస్తున్న దృశ్యం కనిపించింది. ఈగలు విపరీతంగా ఉన్నాయి. మీల్ మేకర్‌పై ఈగలు ముసురుకున్నాయి. అంతేకాదు అక్కడ పని చేసే వారందరూ మీల్ మేకర్‌ను తొక్కుతూ నడుస్తున్నారు. ఈ వాతావరణాన్ని చూసి అధికారులు షాకయ్యారు. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న కేంద్రాన్ని సీజ్ చేశారు.
🚨 H-FAST Food Safety Inspection | Jalpally
On 28.07.2026, H-FAST, along with GHMC Food Safety officials, inspected M/s Urvi Food Products, a soya chunks manufacturing unit at Jalpally, Hyderabad.The unit was found operating under highly unhygienic conditions, with workers… pic.twitter.com/uBhKPpiw8d
— Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) July 30, 2026
సంబంధిత వార్తలు

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
జులై 30, 2026

Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
జులై 30, 2026

KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



