త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi | మా ఇండ్లు కూల్చొద్దు.. ఇక్క‌డి నుంచి వెళ్ల‌లేం.. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల నిర‌స‌న

Musi | మూసీ అభివృద్ధి, గాంధీ స‌రోవ‌ర్‌లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మ‌ధు పార్క్ రిడ్జ్ (Madhu park ridge) ప్ర‌ధాన గేటు వ‌ద్ద అపార్ట్‌మెంట్ వాసులు శ‌నివారం శాంతియుత నిర‌స‌న (Protest) తెలిపారు. త‌మ ఇళ్ల‌కు అనుమ‌తులు ఉన్నాయ‌ని.. వాటిని కూల్చ‌కుండా మూసీ (Musi) అభివృద్ధి చేయాల‌ని కోరారు.

S

News | Published On Mar 21, 2026, 5.59 pm IST

Musi | మా ఇండ్లు కూల్చొద్దు.. ఇక్క‌డి నుంచి వెళ్ల‌లేం.. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల నిర‌స‌న
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ అభివృద్ధి, గాంధీ స‌రోవ‌ర్‌లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మ‌ధు పార్క్ రిడ్జ్ (Madhu park ridge) ప్ర‌ధాన గేటు వ‌ద్ద అపార్ట్‌మెంట్ వాసులు శ‌నివారం శాంతియుత నిర‌స‌న (Protest) తెలిపారు. త‌మ ఇళ్ల‌కు అనుమ‌తులు ఉన్నాయ‌ని.. వాటిని కూల్చ‌కుండా మూసీ (Musi) అభివృద్ధి చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ల‌కార్డుల‌ను (Placards) ప్ర‌ద‌ర్శించారు. ఇండ్లు కూల్చుతార‌న్న భ‌యంతో పండ‌గ‌లు కూడా జ‌రుపుకోవ‌డం లేద‌ని వాపోయారు. కంటి నిండా నిద్ర క‌రువైంద‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్నామ‌ని ఇక్క‌డి నుంచి వెళ్ల‌లేమ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement