Donald Trump | హైదరాబాద్‌లో డొనాల్డ్ ట్రంప్ రోడ్డు
హైదరాబాద్ నగరంలోని పలు రోడ్లకు ప్రముఖులు పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు, మరో రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు
Donald Trump | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టాహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ (Rising Telangana)సమ్మిట్‌కు ముందు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు పెట్టాలని నిర్ణయించారు. దానితో పాటు పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాన్సులేట్ జనరల్ రోడ్డు ఇక డొనాల్డ్ ట్రంప్ రోడ్
గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరుతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా (Ratan Tata) పేర్లను నామకరణం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ పేర్లు
వీటితో పాటు గూగుల్ (Google) స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ (Microsoft) జంక్షన్, విప్రో (Wipro) జంక్షన్ పేర్లను కూడా కొన్ని ప్రాథమికంగా నిర్ణయించారు.
దీనిపై పలువురుకి సమాచారం
రహదారుల పేర్లు పెట్టడంపై ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయం, అమెరికా రాయబార కార్యాలయాలకు సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నగర ఖ్యాతి మరింతగా పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



