త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నిరుద్యోగుల‌కు రాకేశ్‌రెడ్డి మెటీరియ‌ల్ ఇవ్వ‌డం అభినంద‌నీయం: కేటీఆర్‌

KTR | వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాకేశ్‌రెడ్డి (Rakesh Reddy) కంరెట్ అఫైర్స్  మెటీరియ‌ల్ (Current Affairs Material) అందించడం అభినంద‌నీయ‌మ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శంసించారు.

S

Telangana | Published On Nov 15, 2026, 6.50 pm IST

KTR | నిరుద్యోగుల‌కు రాకేశ్‌రెడ్డి మెటీరియ‌ల్ ఇవ్వ‌డం అభినంద‌నీయం: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాకేశ్‌రెడ్డి (Rakesh Reddy) కంరెట్ అఫైర్స్  మెటీరియ‌ల్ (Current Affairs Material) అందించడం అభినంద‌నీయ‌మ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శంసించారు. యువత విజయమే ల‌క్ష్యంగా, వారి భవిష్యత్తుకు అండగా నిలవడం మన బాధ్యతన్నారు. ఆదివారం క‌రెంట్ అఫైర్స్ మెటీరియ‌ల్‌ను కేటీఆర్‌ ఆవిష్క‌రించిన అనంత‌రం మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోటీ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్ర‌తి ఒక్క‌రూ ఉద్యోగం సాధించాలి

ఉద్యోగార్థులకు కేవలం మాటలతో భరోసా ఇవ్వడమే కాకుండా, వారి లక్ష్య సాధనకు అవసరమైన విద్యా వనరులను అందించే ప్రయత్నం చేస్తున్న రాకేష్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. నిరుద్యోగ యువత కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement