CM Revanth Reddy | ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులు.. సీఎం రేవంత్ శంకుస్థాపనలు
CM Revanth Reddy | ఆదిలాబాద్ (Adilabad) పర్యటన సందర్భంగా సోమవారం పలు అభివృద్ధి పనుల(Development works) కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. పిప్రి సభకు వెళ్లిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్ (Adilabad) పర్యటన సందర్భంగా సోమవారం పలు అభివృద్ధి పనుల(Development works) కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. తొలుత బాసర అమ్మవారిని దర్శించుకుని రూ.225 కోట్లతో చేపట్టనున్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పిప్రి సభకు వెళ్లిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం, నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టు, పిప్రి ఎత్తిపోతల పథకం వంటి పనులకు ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ శంకుస్థాపన చేసిన పనుల వివరాలు..
- బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం : రూ. 200 కోట్లు)
- బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం (అంచానా వ్యయం : రూ. 45.15 కోట్లు)
- బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుంచి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణం (అంచనా వ్యయం: రూ 30.00 కోట్లు)
- బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ లలో (3) 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం (అంచనా వ్యయం: రూ 8.99 కోట్లు)
- బోథ్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 50.70 కోట్లు)
- బోథ్ నియోజకవర్గంలో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన (రూ 44.64 కోట్లు)
- నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ. 20.10 కోట్లు
- ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనానికి ప్రారంభోత్సవం (అంచనా వ్యయం : రూ. 20 కోట్లు)
- ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం (అంచనా వ్యయం : రూ 13.46 కోట్లు)
- ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనం ప్రారంభోత్సవం (అంచనా వ్యయం: రూ 20.00 కోట్లు)
- ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 38 వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 30 కోట్లు)
- ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణం (అంచనా వ్యయం: రూ 6.435 కోట్లు)
- ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణం (రూ 15.00 కోట్లు)
- ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకం (అంచనా వ్యయం: రూ 65.85 కోట్లు)
- ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 31.52 కోట్లు)
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 11.76 కోట్లు)
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



