త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamatha Banerjee | బెంగాల్ ఓట‌ర్ల హక్కులపై కుట్ర.. ఈసీఐకి మ‌మ‌త లేఖ‌

Mamatha Banerjee | బెంగాల్‌ (Bengal)లో ప్రజాస్వామ్య హక్కులను కాల‌రాసేందుకు కుట్ర‌ల‌కు తెర లేపార‌ని సీఎం మ‌మ‌త బెన‌ర్జీ (CM Mamatha Banerjee) ఆరోపించారు. బీజేపీ ప్రొద్బ‌లంతో వేల సంఖ్య‌లో న‌కిలీ ఓట‌ర్ల (Fake voters) ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పిస్తున్న‌ట్లు ఆమె విమ‌ర్శించారు. ఈమేర‌కు ఈసీఐ(ECI)కి మూడు పేజీల లేఖ రాశారు.

S

News | Published On Mar 31, 2026, 5.15 pm IST

Mamatha Banerjee | బెంగాల్ ఓట‌ర్ల హక్కులపై కుట్ర.. ఈసీఐకి మ‌మ‌త లేఖ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బెంగాల్‌ (Bengal)లో ప్రజాస్వామ్య హక్కులను కాల‌రాసేందుకు కుట్ర‌ల‌కు తెర లేపార‌ని సీఎం మ‌మ‌త బెన‌ర్జీ (CM Mamatha Banerjee) ఆరోపించారు. బీజేపీ ప్రొద్బ‌లంతో వేల సంఖ్య‌లో న‌కిలీ ఓట‌ర్ల (Fake voters) ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పిస్తున్న‌ట్లు ఆమె విమ‌ర్శించారు. ఈమేర‌కు ఈసీఐ(ECI)కి మూడు పేజీల లేఖ రాశారు. వెంట‌నే ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించాల‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. బీహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర​ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమ‌ర్శించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్దం..

బీజేపీకి చెందిన ఏజెంట్లు నివాసం లేని వారు, బయటి రాష్ట్రాల వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఓటర్ల దోపిడీ ప్రయత్నంగా అభివర్ణిస్తున్నామ‌న్నారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా నిజమైన ఓటర్ల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయ‌ని, SIR ప్రక్రియలో లోపాల కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నకిలీ దరఖాస్తుల ప‌రిశీల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త కొర‌వ‌డి ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధ‌మ‌న్నారు. "ఒక రాజ్యాంగ సంస్థ నుంచి ఆశించే ప్రమాణాలు ఇవి కావు" అని ఆమె లేఖలో స్పష్టం చేశారు.

స్వేచ్ఛాయుత ఎన్నిక‌ల‌పై దాడి...

బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై ఇది ప్రత్యక్ష దాడిగా ఆమె అభివర్ణించారు. వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. గ‌త ఫిబ్ర‌వ‌రి 28న‌ విడుదలైన తుది ఓటర్ల‌ జాబితా తర్వాత ఎలాంటి నకిలీ ఓటర్లను చేర్చకూడదని డిమాండ్ చేశారు.
ఈ విష‌యంలో బెంగాల్‌ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్ ఎన్నిక‌ల‌ను రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. మే 4న ఫలితాలు వెలువ‌డుతాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement