త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunitha Lakshma Reddy | పంట‌లు ఎండుతున్న‌య్‌.. సింగూర్ నీళ్లు వ‌ద‌లండి- ఉత్త‌మ్‌కు సునీతా ల‌క్ష్మారెడ్డి లేఖ‌

Sunitha Lakshma Reddy | న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం(Narsapur Constituency)లో యాసంగి పంట‌ల‌కు నీరంద‌క రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) నుంచి వెంట‌నే నీటిని (Water) విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) కోరారు. ఈమేర‌కు ఆమె ఆదివారం రాష్ట్ర‌ నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.

S

News | Published On Apr 12, 2026, 12.36 pm IST

Sunitha Lakshma Reddy | పంట‌లు ఎండుతున్న‌య్‌.. సింగూర్ నీళ్లు వ‌ద‌లండి- ఉత్త‌మ్‌కు సునీతా ల‌క్ష్మారెడ్డి లేఖ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వేస‌వి దృష్ట్యా న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం(Narsapur Constituency)లో యాసంగి పంట‌ల‌కు నీరంద‌క రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) నుంచి వెంట‌నే నీటిని (Water) విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) కోరారు. ఈమేర‌కు ఆమె ఆదివారం రాష్ట్ర‌ నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.

ఇవీ లేఖ వివ‌రాలు..

సింగూర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన‌ట్లు నాకు స‌మాచారం ఉంది. కానీ మంజీరా డ్యామ్ అధికారుల‌కు స‌రైన ఆదేశాలు లేక‌పోవ‌డంతో క్షేత్ర‌స్థాయిలో వ్య‌వ‌సాయానికి నీటిని విడుద‌ల చేయ‌లేదు. గ‌త నెల‌లోనే ఈ స‌మ‌స్య‌పై మిమ్మ‌ల్ని క‌లిసి రైతుల త‌ర‌ఫున లిఖిత‌పూర్వ‌కంగా విన‌తిప‌త్రం ఇచ్చాను. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీలో కూడా ప్ర‌స్తావించాను. మీ మౌఖిక ఆదేశాల ప్ర‌కారం ఎస్ఈ ద్వ‌రా సింగూర్ ప్రాజెక్ట్ డీఈకి లిఖిత పూర్వ‌క ఆదేశాలిచ్చిన‌ప్ప‌టికీ అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం క‌నిపిస్తుంది. ఇరిగేష‌న్ విభాగం అధికారులు ఒక‌లా, మంజీరా డ్యామ్ అధికారులు మ‌రో విధంగా స్పందించ‌డం వ‌ల్ల ఆల‌స్యం జ‌రుగుతోంది. దీంతో రైతుల‌కు పంట న‌ష్టం వాటిళ్లుతోంది.

30 శాతం ఎండిపోయాయి..

ఇప్ప‌టికే సుమారు 30 శాతం పంట‌లు ఎండిపోయాయి. ఘ‌న్‌పూర్ ఆన‌క‌ట్ట విడుద‌ల చేయాల్సిన నీరు విడుదల చేయ‌క‌పోతే అధికారికంగా 21,650 ఎక‌రాలు, అన‌ధికారికంగా సుమారు 60,000 ఎక‌రాల వ‌రి పంట‌లు చేతికంద‌కుండా పోయే ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఉన్న పంట‌ల‌ను కాపాడుకోవాలంటే చివ‌రి త‌డిగా క‌నీసం 0.3 టీఎంసీల నీటిని త‌క్ష‌ణం విడుద‌ల చేయాలి. ఘ‌న‌పూర్ ఆన‌క‌ట్ట ప‌రిధిలో 10 లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాలు, 7 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి.

వరి పంట‌లు పొట్ట ద‌శ‌లో ఉన్నాయి. ఈ స‌మ‌యంలో నీరంద‌కుంటే దిగుబ‌డిపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. రైతులు భారీ పెట్టుబ‌డులు పెట్టారు. కీల‌క ద‌శ‌లో నీరంద‌కుంటే పంట‌లు న‌ష్ట‌పోయి రైతులు అప్పుల పాల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో మీరు స్పందించి నీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌మైన‌, లిఖిత‌పూర్వ‌క‌మైన ఆదేశాలు త‌క్ష‌ణ‌మే జారీ చేయాల‌ని కోరుతున్నాను.

ఇట్లు
సునీతా ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

 

 

 

 

 

 

 

 

Advertisement
Advertisement