త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | చోర్ చేసే వాళ్లే చోర్ చోర్‌ మాట్లాడ‌త‌రు: కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు సెటైర్లు

Ramchandar Rao | చోర్ చేసే వాళ్లే చోర్ చోర్ మాట్ల‌డాతార‌ని, మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ (Congress) నాయ‌కులు అదేప‌ని చేశార‌ని, ఇప్పుడు వాళ్ల చోరీలు న‌డ‌వ‌ట్లేవ‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఎద్దేవా చేశారు. పశ్చిమ‌ బెంగాల్‌లో మ‌మ‌తా బెనర్జీ మూడు సార్లు గెలిచినా మేం ఏమ‌న‌లేద‌న్నారు.

S

News | Published On May 5, 2026, 12.20 pm IST

Ramchandar Rao | చోర్ చేసే వాళ్లే చోర్ చోర్‌ మాట్లాడ‌త‌రు: కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు సెటైర్లు
Advertisement
  • ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా ప్ర‌జాతీర్పును గౌర‌వించాలే
  • మ‌మ‌త మూడుసార్లు గెలిచినా మేం ఏమ‌న‌లే
  • కాంగ్రెసోళ్లు ఓడిపోతే ఏదేదో మాట్లాడ‌తారు
  • కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శ‌లు

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: చోర్ చేసే వాళ్లే చోర్ చోర్ మాట్ల‌డాతార‌ని, మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ (Congress) నాయ‌కులు అదేప‌ని చేశార‌ని, ఇప్పుడు వాళ్ల చోరీలు న‌డ‌వ‌ట్లేవ‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా ప్ర‌జా తీర్పును ప్ర‌తిఒక్క‌రూ గౌర‌వించాల‌ని కోరారు. ఈనెల 10న ప్ర‌ధాని మోదీ (PM Modi) రాకను పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం తార్నాక‌లో కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి వాల్‌రైటింగ్‌ (Wall writing) లో పాల్గొన్నారు.

మ‌మ‌త గెలిస్తే మేమేమ‌న్నా అన్నామా?

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచేలా మాట్లాడొద్దు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాతీర్పు స‌ర్వోన్న‌త‌మైన‌ది. కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అవ‌మాన ప‌రుస్తుంది. వారు గెలిస్తే ఏం మాట్లాడ‌రు. ఓడిపోతే ఏదేదో మాట్లాడ‌తారు. పశ్చిమ‌ బెంగాల్‌లో మ‌మ‌తా బెనర్జీ మూడు సార్లు గెలిచారు. మేం ఎప్పుడూ ఏం అన‌లే. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాం. ప్ర‌తి తీర్పును సాద‌రంగా ఒప్పుకున్నాం. కానీ కాంగ్రెస్ నాయ‌కులు ఈరోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్న‌రు అని బీజేపీ చీఫ్ నిల‌దీశారు.

వాళ్లు ఓడిపోతే ఏదీ బాగ‌లేదంట‌రు..

వాళ్లు ఓడిపోతే ఈవీఎం బాగ‌లే. వాళ్లు ఓడిపోతే మోదీ బాగ‌లే. వాళ్లు ఓడిపోతే ఈసీ బాగ‌లే.. వారు ఓడిపోతే ఏదీ బాగ‌లేదు, వాళ్లు ఓడిపోతే మొత్తం దేశ‌మే బాగ‌లేదంట‌రు. ఎప్పుడైనా స‌రే ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జా తీర్పును అంద‌రూ గౌర‌వించాలి అని రాంచంద‌ర్‌రావు సూచించారు.

మోదీ ఆర్థిక దిశ‌ను చూపెట్టారు..

ప్ర‌ధాని మోదీ ఈనెల 10న తెలంగాణ‌కు మూడోసారి వ‌స్తున్నారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కోరుతున్నా. ఈ ప్ర‌చారంలో భాగంగా ఈరోజు తార్నాకాలో వాల్ రైటింగ్ చేయ‌డం జ‌రిగింది. వాల్‌పోస్ట‌ర్లు, వాల్ రైటింగ్ ద్వారా ప్ర‌చారం చేస్తున్నం. మోదీ దేశానికి చేసిన సేవ‌లు విలువైన‌వి. ఆర్థిక దిశ‌ను చూపెట్టారు. ప్ర‌పంచంలో ఆర్థిక మాంధ్యం ఉన్న‌ప్ప‌టికీ మ‌నం అభివృద్ధి వైపు పోతున్నం. అందుకే మోదీకి మ‌న‌మంతా ఘ‌న స్వాగ‌తం ప‌ల‌కాలి. ఇందుకు తార్నాక‌లో ని వాల్ రైటింగ్లో పాల్గొని అవ‌గాహ‌న కల్పిస్తున్నం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మేయ‌ర్, రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు బండా కార్తికారెడ్డి, మ‌ల్లేశ్‌, వెంక‌టేష్, వేణుయాద‌వ్‌, సుబ్బారావు త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement