Telangana | నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్కమార్క
Telangana | నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRDI)లో గురువారం "Coinage and Economy of Southern India" (దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ) అనే అంశంపై న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
Telangana | నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. యువ పరిశోధకులు అంతరశాస్త్రీయ అధ్యయనాలపై దృష్టి సారించాలని సూచించారు. శా తవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుండి విజయనగర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, నైపుణ్యమైన రాజ్యపాలనకు ప్రతీకగా నిలిచాయని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRDI)లో గురువారం "Coinage and Economy of Southern India" (దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ) అనే అంశంపై న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని తెలిపారు.
దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందన్నారు. ఈ నాణేలు మనతో మాట్లాడతాయన్న ఆయన కొన్నిసార్లు బిగ్గరగా ఆ కాలపు పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, వాణిజ్య ప్రాధాన్యతలు, రాజకీయ దృక్పథం గురించి ఎన్నో విషయాలను వివరిస్తాయని చెప్పారు. వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజియంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే సర్వాంగ సుందరమైన జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. సామ్రాజ్యాలు ఉదయించడం మరియు ఆస్తమించడం చూసిన ఈ శాఖకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మైలురాయన్నారు. ఈ సదస్సు తెలంగాణకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకూ గర్వకారణమని చెప్పారు. న్యూ మిస్ మ్యాటిక్స్ అంటే చేతిలో పట్టుకునే చిన్న చిన్న లోహపు ముద్రల అధ్యయనం మాత్రమే అనిపించవచ్చు. కానీ ఒక నాణెం పైకి చూస్తే అది ఒక చిన్న ప్రపంచమే కనిపిస్తుందన్నారు. నాణేలు మన పురాతన “కంప్రెస్డ్ డేటా” లాంటివి అని తాను తరచూ భావిస్తుంటానని తెలిపారు. కొద్ది గ్రాముల లోహంలో ఆ కాలం ఆర్థిక వ్యవస్థ, రాజు ఆశయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు, దౌత్య సంబంధాలు అన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయని వివరించారు. ఈ ఒక్క నాణెంలోనే రాజకీయాలు, ఆధ్యాత్మికత, లోహశాస్త్రం, కళ, ఆర్థిక వ్యవస్థ వంటి అన్ని అంశాలు ఒకేచోట కలిసిపోయాయన్నారు. ఆధునిక చరిత్రకారుడు ఈ చిన్న లోహపు ముక్క చెప్పే విషయం చెప్పేందుకు పేజీల తరబడి రాయాల్సి ఉంటుందని చెప్పారు.
సదస్సులో పాల్గొనే వారందరి మధ్య ఫలప్రదమైన చర్చలు, కొత్త స్నేహాలు, కొత్త అన్వేషణలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. మన శాస్త్రానికి, మన పూర్వీకుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ హెరిటేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జునరావు, న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ డి. రాజారెడ్డి, జనరల్ సెక్రెటరీలు ప్రొఫెసర్ పి.ఎన్. సింగ్, ప్రొఫెసర్ బింద దత్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందా యాన్ ఎర్లీ హిస్టారిక్ సైట్ ఇన్ తెలంగాణ, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఐకానోగ్రఫీ సాల్వేజ్‌డ్ ఫ్రమ్ కృష్ణా-తుంగభద్ర వ్యాలీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, సౌత్ ఇండియన్ ఫానమ్స్, 106 యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎన్ఎస్ఐ జర్నల్ తదితర పుస్తకాలను వేదికపై ఉన్న ప్రముఖులతో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



