CM Revanth| రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి
కన్నేపల్లి పంప్ స్టేషన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి వరకు తరలించవచ్చని సూచన చేసిన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లను జైలుకు పంపకుండా తప్పు పని చేశామని విమర్శించారు.
కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయలేమని శనివారం మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్: కన్నేపల్లి పంప్ స్టేషన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి వరకు తరలించవచ్చని సూచన చేసిన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లను జైలుకు పంపకుండా తప్పు పని చేశామని విమర్శించారు. కేసీఆర్ సూచన మేరకే బీఆర్ ఎస్ వాదనలను వాళ్లు ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అప్పుడో మాట ..ఇప్పుడో మాట
కన్నేపల్లి పంప్ హస్ వద్ద నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న వాదనను తిప్పి కొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ రిటైర్డ్ ఇంజనీర్లను తీసి బొక్కల ఏయకపోవడమే మేం చేసిన తప్పు. ఎందుకంటే ఈ కాళేశ్వరం దోపిడీలో వాళ్లకు కూడా భాగస్వామ్యం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు.ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సలహాలు చెబుతున్నాయన ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు. 2015 జనవరి 21 రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో రిటైర్డ్ సీఈలు అనంత రాములు,వెంకట రమణారావు,చంద్రమౌళి , దామోదర్ రెడ్డి, రిటైర్డ్ ఈఈ శ్యాంప్రసాద్ రెడ్డి లతో
కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్లు ఆ రోజు.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఏర్పాటు మంచిది కాదు. ఆర్థికంగా భారం..అంతే కాకుండా నష్టం జరుగుతుంది..
తుమ్మిడిహట్టి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద నిర్మించాలని చెప్పిండ్రు. ఇప్పుడు ఆ మొనగాడు శ్యాంప్రసాద్ రెడ్డి..నిన్నమొన్న బయటికివచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు. ఎందుకంటే చర్లపల్లి జైలుకు పంపలేదు కదా. ఇయాల ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని.. కిలాడీ కమిటీ ప్రజల ముందు దోషులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నరు" అని ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు.
ఇంతకీ రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్పారు
TelanganaRetiredEngineers
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రైతులు తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎల్-నినో (El-Nino) ప్రభావంతో మాన్‌సూన్ వర్షాలు జాడలేవు. రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) లెక్కల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయికంటే 16-46 శాతం తక్కువగా ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టులను (Lifts) ఎలా సురక్షితంగా వినియోగించుకోవచ్చో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) ఓ ప్రెస్ నోట్ ద్వారా ప్రభుత్వానికి వివరించింది.
ప్రాణహిత.. ఆశాకిరణం
రాష్ట్రంలో నీటి కటకట ఉన్నప్పటికీ.. ఒక్క ప్రాణహిత నది (Pranahita river) లో మాత్రం వినియోగించుకునేంత వరద ప్రవాహం అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా వాడుకోవడం ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అని TREA అంటోంది. ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం మెండుగా ఉందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం గేట్లు పూర్తిగా తెరిచి ఉన్న పరిస్థితిలో ప్రాణహిత వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉంది. ఈ లెవెల్స్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepalli pump house) రోజుకు సుమారు 3 టీఎంసీల (TMC) వరకు నీటిని లిఫ్ట్ చేయగలదు.
ముప్పు లేకుండా వాడుకోవచ్చు
నీరు సాఫీగా పైకి వెళ్లాలంటే అన్నారం, సుందిల్ల జలాశయాలను వాటి కనిష్ఠ డ్రా-డౌన్ (MDDL) స్థాయిల వద్దే నిల్వ చేయాలని TREA సూచించింది. అన్నారం వద్ద సుమారు +116.500 మీటర్లు, సుందిల్ల వద్ద +126.500 మీటర్ల లెవెల్ ఉంటే బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. అప్పుడు మూడు పంపింగ్ స్టేషన్లు ఒకేసారి కరెక్ట్ కో-ఆర్డినేషన్‌తో (Coordination) పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5.1 టీఎంసీలు, సుందిల్లలో 3.78 టీఎంసీలు కలిపి మొత్తం 8.8 టీఎంసీల (TMC) నిల్వ సామర్థ్యం ఉంది.
ఒకవేళ పొరపాటున ఆ రెండు బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనా, ఆ 8.8 టీఎంసీల నీరు సుమారు 1.02 లక్షల క్యూసెక్కుల (Cusecs) ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే నదిలో ఉంటుందని లెక్కగట్టి చెప్పారు. గతంలో మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిన సందర్భాలు ఉన్నాయని, కాబట్టి ఈ 8.8 టీఎంసీల నీటి వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం, ఊర్ల ముంపు (Submergence) ఉండదని గత అనుభవాలను గుర్తు చేశారు.
ఎల్లంపల్లికి తరలించండి
ప్రాణహితలో నీటి మట్టం మేడిగడ్డ MDDL కంటే ఎత్తుగా ఉన్నంతకాలం.. కన్నెపల్లి పంప్ స్టేషన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి (Yellampalli) వరకు తరలించడం అన్ని విధాలా లాభదాయకమని ఇంజనీర్లు సూచించారు. సాంకేతిక నియమాలను పాటిస్తూ లిఫ్టులను నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. ఎల్-నినో వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తేవాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ సేవలను స్వచ్ఛందంగా అందించేందుకు సిద్ధమని TREA ప్రకటించింది.
సంబంధిత వార్తలు

Kyama Mallesh | ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం
జూన్ 30, 2026

Rani Rudrama Reddy | అమరావతిలో జాగివ్వండి.. తెలంగాణా వైతాళికుల విగ్రహాలు పెట్టి స్ఫూర్తి కొనసాగిస్తం: చంద్రబాబుకు రాణి రుద్రమరెడ్డి విజ్ఞప్తి
మే 30, 2026

Bandi Sanjay | బెంగాల్ ను గెలవాలే.. ఇదే మా ఆతృత: బండి సంజయ్
మే 4, 2026
తాజావార్తలు
- ●Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
- ●S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు
- ●Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!
- ●Shabad Murder Case | షాబాద్ మర్డర్ మిస్టరీ: ఆరుగురిని చంపి రెంటల్ కారులో పరార్.. వాడిని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు
- ●Tollywood | ఏపీ ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ - లక్ష్మి ప్రణతి లుక్ రిలీజ్
- ●Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు

Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!

Shabad Murder Case | షాబాద్ మర్డర్ మిస్టరీ: ఆరుగురిని చంపి రెంటల్ కారులో పరార్.. వాడిని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు



