Rani Rudrama Reddy | అమరావతిలో జాగివ్వండి.. తెలంగాణా వైతాళికుల విగ్రహాలు పెట్టి స్ఫూర్తి కొనసాగిస్తం: చంద్రబాబుకు రాణి రుద్రమరెడ్డి విజ్ఞప్తి
Rani Rudrama Reddy | హైదరాబాద్ నడి ఒడ్డున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు విగ్రహం, రవీంద్ర భారతిలో బాల సుబ్రమణ్యం విగ్రహాలు పెట్టినట్టే ఏపీలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టాలని బీజేపీ తెలంగాణ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
Rani Rudrama Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నడి ఒడ్డున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు విగ్రహం, రవీంద్ర భారతిలో బాల సుబ్రమణ్యం విగ్రహాలు పెట్టినట్టే ఏపీలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టాలని బీజేపీ తెలంగాణ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నగరంలో విగ్రహాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుగు ప్రజలు ఒక్కటే అనే భావన కలిగించారన్నారు. ఏపీలో కూడా మాకు జాగ చూపిస్తే తెలంగాణా వైతాళికుల విగ్రమాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
కృష్ణానది ఒడ్డున, సచివాలయ పరిసరాల్లో..
కళలకు, రాజకీయాలకు ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. అమరావతిలో దేశ ప్రధాని అయిన ఏకైక తెలుగు బిడ్డ, ప్రఖ్యాత సాహితీవేత్త, భారతరత్న పీవీ నర్సింహారావు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యులు డా. సీ నారాయణ్ రెడ్డి, ప్రముఖ సాహితీ వేత్త దాశరథి, తెలంగాణా సాహిత్య అస్తిత్వం కాళోజీ, తెలంగాణ నటులు కాంతారావు, బమ్మెర పోతన వంటి విగ్రహల ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో కృష్ణా నది ఒడ్డున, సచివాలయ పరిసరాల్లో అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీ వేత్తలతో కలిసి వెయ్యి మందితో కలిసి వచ్చి విగ్రహాలు ఏర్పాటు చేసి, సీఎం చంద్రబాబు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిష్టింపచేస్తామని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






