త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Star Campaigners | స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో సీఎం రేవంత్‌, భ‌ట్టి

CM Revanth Reddy | త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా స్టార్ క్యాంపెయిన‌ర్ల (Star Campaigners) జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చోటు క‌ల్పించింది. మూడు రాష్ట్రాలకు 40 మంది చొప్పున స్టార్​ క్యాంపెయినర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) నియ‌మించారు. శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న జాబితా (List) ను విడుదల చేశారు.

S

News | Published On Mar 27, 2026, 7.08 pm IST

Star Campaigners | స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో సీఎం రేవంత్‌, భ‌ట్టి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా స్టార్ క్యాంపెయిన‌ర్ల (Star Campaigners) జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చోటు క‌ల్పించింది. కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాలకు 40 మంది చొప్పున స్టార్​ క్యాంపెయినర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) నియ‌మించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న జాబితా (List) ను విడుదల చేశారు. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్​ల పేర్లు ఉన్నాయి.

కొద్ది రోజుల్లో కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. అత్యంత ప్ర‌భావంగా ఉన్న నాయ‌కుల‌ను ప్ర‌చారంలో దింపేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement