త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Msvg Trailer | మెగా స్వాగ్ అదుర్స్ – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ట్రైల‌ర్ రిలీజ్‌

చిరంజీవి హీరోగా న‌టిస్తున్న మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ట్రైల‌ర్ ఆదివారం రిలీజైంది. చిరంజీవి స్టైల్ మాస్, యాక్ష‌న్ అంశాల‌తో పాటు అనిల్ రావిపూడి మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. వెంక‌టేష్ ఎంట్రీ సీన్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

N

News | Published On Jan 4, 2026, 4.46 pm IST

Msvg Trailer | మెగా స్వాగ్ అదుర్స్  – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Msvg Trailer |  మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మూవీ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్‌తో పాటు మీసాల పిల్ల‌, శ‌శిరేఖ‌తో పాటు మెగా విక్ట‌రీసాంగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

మెగాస్టార్ ఎలివేష‌న్లు...

తాజాగా ఆదివారం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి స్టైల్ మాస్, యాక్ష‌న్ అంశాల‌తో పాటు అనిల్ రావిపూడి మార్కు కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఈ ట్రైల‌ర్ సాగింది.
"ఇంటిలెజెన్స్ బ్యూరో, రా ఏజెంట్‌, నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్‌... ఎలాంటి క్రిమిన‌ల్‌ను అయినా ఉతికి పిండి ఆరేస్తారు"..అంటూ చిరంజీవి గురించి అత‌డి టీమ్ ఇచ్చే ఎలివేష‌న్ల‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. రియ‌ల్‌లైఫ్‌లో అందుకు భిన్నంగా బ‌ట్ట‌లు ఉతుకుతూ, వంట చేస్తూ చిరంజీవి క‌నిపించారు. న‌య‌న‌తార ఎంట్రీతో ట్రైల‌ర్ కామెడీలోకి ట‌ర్న్ తీసుకుంది. నా లైఫ్ నుంచి దూరంగా వెళ్లిపో అని చిరంజీవిని న‌య‌న‌తార ద్వేషించుకోవ‌డం, ఆమెపై ఆధిప‌త్యం చెలాయిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తూనే అతి భ‌య‌స్తుడిగా చిరంజీవి క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంది. "శ‌శి వేలు చూపించి మాట్లాడుతున్నావేంటి ఏం అనుకుంటున్నావు...నువ్వు అంత‌గా తిట్టాల‌ని అనుకుంటే...అంటూ సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చి వెంట‌నే లోప‌లికి వ‌చ్చి తిట్ట‌వా "అంద‌రూ చూస్తున్నారు అంటూ న‌య‌న‌తార‌ను చిరంజీవి బ‌తిమిలాడ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

వెంకీ ఎంట్రీ అదుర్స్‌...

వెంక‌టేష్ ఎంట్రీ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. "చూడ‌టానికి మంచి ఫ్యామిలీ మ్యాన్‌లా ఉన్నావు. ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి "అంటూ వెంక‌టేష్‌పై చిరంజీవి సెటైర్ వేశారు. "మాస్‌కే బాస్‌లా ఉన్నావు నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి" అంటూ వెంక‌టేష్ పంచ్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంది. ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో చిరంజీవి స్టైలిష్‌గా క‌నిపించారు.
మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌గారు ట్రైల‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో క్యాథ‌రిన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారులో వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ ఇర‌వై నిమిషాల వ‌ర‌కు క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత‌తో క‌లిసి సాహు గార‌పాటి నిర్మిస్తున్నారు.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement