MP Kadiyam Kavya | కేంద్రం భేషరతుగా క్షమాపణ చెప్పాలి: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నాలో ఎంపీ కడియం కావ్య
Kadiyam Kavya | భాజపా ఎంపీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ (Parliament) మకర ద్వారం వద్ద ఫ్లాకార్డులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) ధర్నా(protest)కు దిగారు. భాజపా ఎంపీ తేజస్వీ సూర్య (Tejaswi Surya) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
త్రినేత్ర.న్యూస్: భాజపా ఎంపీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ (Parliament) మకర ద్వారం వద్ద ఫ్లాకార్డులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) ధర్నా(protest)కు దిగారు. భాజపా ఎంపీ తేజస్వీ సూర్య (Tejaswi Surya) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్- పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత దురదృష్టకరమన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ఫ్లాకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “బీజేపీ క్షమాపణలు చెప్పాలి”, “తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి” అంటూ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం మార్మోగింది. భాజపా ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కడియం కావ్య డిమాండ్ చేశారు.
ధర్నాలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం సిగ్గుచేటన్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు.
రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టం కలిగించినప్పటికీ సోనియా గాంధీ పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కావ్య పేర్కొన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ పట్ల నిరంతర వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారని, ‘బ్లాక్ డే’ వంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల భావోద్వేగాలను అవమానిస్తున్నారని విమర్శించారు. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కావ్య డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Lok Sabha | ప్రధాన్‌ను తొలగించండి.. పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
జులై 24, 2026

Deshapathi Srinivas | నొక్కేయాలని చూస్తే పునాదులనే కదిలిస్తరు.. బొద్దింకలే బోధిసత్వులై దారి చూపుతరు
జులై 23, 2026

Congress | రాహుల్ అరెస్టుకు నిరసనగా.. నేడు కాంగ్రెస్ చలో లోక్‌భవన్
జులై 22, 2026
తాజావార్తలు
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
- ●Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
- ●Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్
- ●Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!

Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు



