త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deshapathi Srinivas | నొక్కేయాల‌ని చూస్తే పునాదుల‌నే క‌దిలిస్త‌రు.. బొద్దింకలే బోధిసత్వులై దారి చూపుత‌రు

Deshapathi Srinivas | అణ‌చివేత ఎదురైతే సమాజంలో అత్యంత సాధారణంగా భావించే సామాన్యులే రేపటి భావజాల విప్లవానికి నాయకుల‌వుతార‌ని క‌వి, గాయ‌కుడు, ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. బొద్దింకలే బోధిసత్వులై దేశ న‌వ శ‌కానికి నాంది ప‌లుకుతార‌న్నారు. ఢిల్లీలో లేచిన సీజేపీ ఉద్య‌మం ఏ రాజ‌కీయ శ‌క్తి ప్రేరేపిత‌మో కాద‌న్నారు.

S

Telangana | Published On Jul 23, 2026, 2.00 pm IST

Deshapathi Srinivas | నొక్కేయాల‌ని చూస్తే పునాదుల‌నే క‌దిలిస్త‌రు.. బొద్దింకలే బోధిసత్వులై దారి చూపుత‌రు
Advertisement
  • సీజేపీ ఉద్య‌మం వెనక ఏ రాజ‌కీయ శ‌క్తి లేదు
  • దేశ‌ యువత స్వ‌చ్ఛందంగా చేస్తున్న‌ ఆత్మగౌరవ సమరమ‌ది
  • మోదీ గారూ.. ఇక‌నైనా మేల్కోండి
  • ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌ ఫైర్‌

Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌: అణ‌చివేత ఎదురైతే సమాజంలో అత్యంత సాధారణంగా భావించే సామాన్యులే రేపటి భావజాల విప్లవానికి నాయకుల‌వుతార‌ని క‌వి, గాయ‌కుడు, ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. బొద్దింకలే బోధిసత్వులై దేశ న‌వ శ‌కానికి నాంది ప‌లుకుతార‌న్నారు. ఢిల్లీలో లేచిన సీజేపీ ఉద్య‌మం ఏ రాజ‌కీయ శ‌క్తి ప్రేరేపిత‌మో కాద‌న్నారు. త‌మ బంగారు భ‌విష్య‌త్ కోసం దేశ యువ‌త స్వ‌చ్ఛందంగా చేస్తున్న‌ ఆత్మ‌గౌర‌వ స‌మ‌రం అని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు ఆయ‌న గురువారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ప్రధాని మోడీ గారూ.. మీరు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, విజ్ఞతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఏ రాజకీయ శక్తి ప్రేరేపితమో కాదు.. దేశ యువత తమ భవిష్యత్తు కోసం చేస్తున్న‌ ఆత్మగౌరవ సమరం. వారి హృదయాల్లో రగులుతున్న అసంతృప్తిని కేవలం నిరసనగా కాకుండా, 'సుపరిపాలన' కోసం వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆకాంక్షగా గుర్తించండి అని దేశ‌ప‌తి కోరారు.

ప్ర‌జా విస్ఫోటనానికి దారి తీస్త‌ది..

ఆ నిరుపేద యువత కళ్లలో కనిపిస్తున్నది పట్టుదల మాత్రమే కాదు.. తమ హక్కుల పట్ల అవగాహనతో శాంతియుతంగా, గాంధేయ మార్గంలో ఉద్య‌మం సాగిస్తున్నారు. ఈ ఉద్యమ చేతనను అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే.. అది మరింత తీవ్రమైన ప్రజా విస్ఫోటనానికి దారి తీస్తుంది. ప్రభుత్వ పునాదులనే కదిలించే స్థాయికి చేరుకుంటుంది. అధికారం శాశ్వతం కాదు.. అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక బాధ్యత మాత్రమే అని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

అవినీతి పెచ్చుమీరి, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం నశించినప్పుడు.. కాలమూ, ప్రజాభిప్రాయమూ తిరగబడటం చరిత్ర నేర్పిన సత్యం. అన్ని వ్యవస్థలనూ తమ నియంత్రణలోనే ఉంచుకుని, ‘ఏం చేసినా చెల్లుతుంది’ అనే అహంకారం అంత మంచిది కాదు. ఒక‌వేళ అలా ఉంటే సమాజంలో అత్యంత సాధారణంగా భావించే సామాన్యులే, రేపటి భావజాల విప్లవానికి నాయకులుగా మారుతారు. బొద్దింకలే బోధిసత్వులై దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తారని గ్రహించండి అని దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌ మోదీకి సూచించారు.

Advertisement
Advertisement