CM Revanth Reddy | పోషకాహారం, విద్యకు బడ్జెట్‌లో కేటాయింపులు: సీఎం రేవంత్
CM Revanth Reddy | పిల్లల(Childrens) కు నాణ్యమైన విద్య (Educaton), పోషకాహారం (Nutritious food) అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ (Kartheek Muralidharan) సీఎం రేవంత్‌తో శాసనమండలి హాల్‌లో గురువారం సమావేశమయ్యారు.
త్రినేత్ర.న్యూస్: పిల్లల(Childrans) కు నాణ్యమైన విద్య (Education), పోషకాహారం (Nutritious food) అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ (Kartheek Muralidharan) సీఎం రేవంత్‌తో శాసనమండలి హాల్‌లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 0-10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం, విద్యాభ్యాసన స్థాయి సామర్థ్య లోపాల నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పోషకాహారం లోపంతో భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరించారు. ప్రాథమిక స్థాయిలో అందించే బోధన ప్రాధాన్యాన్ని సీఎంకు వివరించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు ‘పోషణ సఖి’ పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.
సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సెర్ప్ సీఈవో దివ్య, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



