MP Dharmapuri Aravind | గడ్డాలు తెల్లవడుతున్నా మళ్లా గదే సబ్జెక్టు.. సుతిలీలు లేవు.. సంచులు లేవని చెప్పుడేంది: ధర్మపురి అరవింద్
MP Dharmapuri Aravind | నేనే గడ్డం మీసాలు లేకుండా పార్టీలకు వచ్చానని.. ఇప్పటికీ తొమ్మిదేండ్లయితుందని.. గడ్డం తెల్లగైనా మళ్లా గదే సబ్జెక్టు మాట్లాడాల్సి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సకాలంలో ధాన్యం కొనకుండా నీ మార్కెటింగ్ శాఖ ఏం పీకుతుందని ప్రశ్నించారు.
- సమయానికి కొనుగోలు కేంద్రాలు సక్కగుండాలే
- నీకు ఏం ప్లానింగ్ లేదు.. చేతగాని దద్దమ్మ నువ్వు
- రైతుల గోస వుచ్చుకుంటున్నవ్
- శాతగాకపోతే రాజీనామా చెయ్.. రాష్ట్రపతి పాలన పెడుతరు
- కాంగ్రెస్ హైకమాండ్‌కు బుద్ధుండాలే
- ప్రపంచంల ప్రతి సంవత్సరం బియ్యం డిమాండ్ పెరుగుతుంది
- మోదీ దగ్గర వోయి గంటసేపు కూసో.. పాలన మొత్తం నేర్పిచ్చి తోలుతడు
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజం
MP Dharmapuri Aravind | త్రినేత్ర.న్యూస్: నేనే గడ్డం మీసాలు లేకుండా పార్టీలకు వచ్చానని.. ఇప్పటికీ తొమ్మిదేండ్లయితుందని.. గడ్డం తెల్లగైనా మళ్లా గదే సబ్జెక్టు మాట్లాడాల్సి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏండ్లు గడుస్తున్నా హమాలీలు లేరు, సుతిలీలు లేవు, లారీలు లేవు అని చెప్పడానికి సీఎం రేవంత్ కు సిగ్గుండాలన్నారు. ఇవన్నింటికి కేంద్రమే పైసలు ఇస్తుందని తెలిపారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సకాలంలో ధాన్యం కొనకుండా నీ మార్కెటింగ్ శాఖ ఏం పీకుతుందని ప్రశ్నించారు.
సిగ్గు, లజ్జ ఉండాలే...
పాతైన సంగతి వదిలేద్దాం. ఈన సంగతే మాట్లాడదం. రెండేండ్లల్లో నాలుగు సీజన్ల మొత్తం ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తమని ఒప్పుకున్నడు. కొనుగోలు చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్ సీఐకి ఇంకా నువ్ బాకీ ఉన్నవ్. ఇది ఈన పనితీరు. రేవంత్ భాషల చెప్పాలంటే సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాలిన రాజకీయం చేయడానికి సిగ్గు, లజ్జ ఉండాలే. శాతగాని దద్దమ్మ నువ్వు.
యూపీలో ఎక్కువ ఇచ్చిర్రు..
పంజాబ్‌లో అనుకున్నదాని కంటే 240 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నరు. 220 ఇచ్చిర్రు. 8 శాతం ఇంకా మిగిలింది. ఛత్తీస్‌గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిర్రు. తెలంగాణలో 27.05 శాతం మీరు ఇంకా అప్పజెప్పలే. ఒడిశాలో 112 లక్షల మెట్రిక్ టన్నులకు 108 లక్షల మెట్రిక్ టన్నులు.. కేవలం మూడున్నర శాతం తక్కువ. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇస్తా అని 80.4 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇది బీజేపీ రూల్ అని అరవింద్ స్పష్టం చేశారు.
మే అయిపోయినా ధాన్యం కొనుడు కాకపాయే..
కోతల సమయానికే కొనుగోలు కేంద్రాలు రెడీ ఉండాలే మిస్టర్. మే ఎండింగ్ దాక కూడా కొనుగోలు కాలేదు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తది. రంగు మారుతది. మొత్తం నూకలైతయ్. సుతిలి లేదు. బియ్యం సంచులు లేవు, హమాలీలు లేవు. ఏంది ఇది.. నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలకు. తొమ్మిదేండ్లయితుంది.
గడ్డం తెల్లగైనా మళ్లా గదే సబ్జెక్టు మాట్లాడుతం. హమాలీలు లేరు, సుతిలీలు లేవు, లారీలు లేవు అని.. ఇవన్నింటికి కేంద్రమే పైసలు ఇస్తది అని తెలిపారు.
ఇసుకకు లారీల కొరత ఉందని ఎన్నడన్నా ఇన్నమా?
ఇసుక తరలించడానికి లారీలొస్తయ్.. దొంగ ఇసుక, దొంగ మొరం తీస్కపోనికి లారీల కొరతనే ఉండదు. ఎన్నడన్న ఇన్నమా? లారీల కొరతతోటి ఇసుక దందా ఆగిందని. ఇంతకుముందు బీఆర్ఎసోళ్లు చేసిర్రు. వడ్లకే లారీల కొరత వస్తది. నువ్ ఇయ్యాల్సినవి ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తవ్. మక్కలన్నీ 400, 500 రూపాలకు తక్కువకు అమ్ముకున్నంక అప్పుడు పెడుతరు వీళ్లు అని ఆయన ఫైరయ్యారు.
లిల్లి అంటే లిల్లిపుట్..
ఈన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీజేపీ ఆఫీస్ ముందర పారబోస్తా, కిషన్‌రెడ్డి ఇంటి ముందర పారబోస్తా, అరవింద్ ఇంటి ముందర పారబోస్తా ఇదా చేతగానితనం. రైతుల గోస వుచ్చుకుంటున్నవ్. రాష్ట్రానికి నీవల్ల అరిష్టం వుచ్చుకుంది. లిల్లి ఇస్ వెరీ సిల్లి.. ఇప్పట్నుంచి నేన్ లిల్లి అంటా. లిల్లి అంటే లిల్లిపుట్ అని ఎపీ ధర్మపురి వ్యాఖ్యానించారు.
నీ మార్కెటింగ్ శాఖ ఏం పీకుతుంది?
కేంద్రానికి ఎంత ఇస్తా అంటున్నవో అంత ఇస్తలేవ్. నీ దగ్గర ఎక్కువ పండుతున్నప్పడు నీ మార్కెటింగ్ శాఖ ఏం పీకుతుంది? నీ దగ్గర ప్లానింగ్ లేదా? ప్రపంచంల ప్రతి సంవత్సరం బియ్యం డిమాండ్ పెరుగుతుంది. 55 కోట్ల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉన్నది. ఎఫ్‌సీఐ ఎక్స్‌పోర్ట్ చేయలేదని లక్షసార్లు చెప్పినం అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి పాలన పెట్టుకుంటే అయిపోతది..
కేంద్ర ప్రభుత్వం దందా చేయదు. మీరు ప్లానింగ్ చేసుకోండి. ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండ్రి, రైస్‌బ్రాండ్ ఇండస్ట్రీస్ పెట్టుకోండి, ఎగుమతి చేసుకోండి. మీరు ఇస్తా అన్నదే ఇయ్యలేదు. ఎందుకంటే మీది చేతగాని ప్రొక్యూర్‌మెంట్. మీరు పని చేస్తలేరు. ఒక్క మార్కెట్ యార్డు సక్కగ చేయలే. పంజాబ్‌ను బీజేపీ ఎప్పుడూ పాలించలే. పంజాబ్‌ల తీసుకుంటున్నరు ఈడ ఎందుకు తీసుకోరు అని అంటున్నరు. మార్కెట్ యార్డులు ఎట్లున్నయో పంజాబ్ ల సూసుకుపో పోయి. నీకు చేతగాకపోతే రాజీనామ చెయ్. లేదా అప్పజెప్పు. రాష్ట్రపతి పాలన పెట్టుకుంటే అయిపోతది. రైతుల గోస వుచ్చుకోకు. ఉన్న సిటీకే దిక్కు లేదంటే ఈన ఫ్యూచర్ సిటీ కడతాడట. నీకు ఏం ఫ్యూచర్ ఉందయ్యా? అని సీఎం రేవంత్‌కు చురకలంటించారు.
హార్వార్డ్ పోయినందుకు 13 వేల డాలర్లు వేస్ట్..
21ఫస్ట్ సెంచరీ లీడర్‌షిప్ ప్రోగ్రాంకు హార్వార్డ్ కు జనవరి నెలలో వారం రోజులు పోయిండు. 20 దేశాల నుంచట 60 మందిని హ్యాండ్ పిక్‌డ్ అట. ఇది అందరు వినాలే. రైతులు కూడా వినాలే. రేవంత్ భారతదేశ చరిత్రల ఫస్ట్ ముఖ్యమంత్రని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. అదే ప్రోగ్రాంకు ఫిబ్రవరిలో నాకు తెలిసిన వ్యక్తితో అప్లయి చేపిచ్చినా. అప్లయి చేసినంక సీటు తీసుకుంటలేరు.. ఫీజు కడుతలేరని ఐదుసార్లు రిమైండ్ చేసిర్రు రండి రండి రండి.. ఫీజు కట్టుండ్రి.. ఫీజు కట్టుండ్రి అని హార్వార్డ్ నుంచి ఐదు ఈమెయిల్ వచ్చినయ్. ఆఫ్ ది రికార్డ్ ఇస్తా. కానీ ఇవి బయట పెట్టకుర్రి. ఈ ప్రోగ్రాం బాగుంది అది బాగుంది అని చెప్తరు. 13 వేల డాలర్లు దీని ఫీజు. అంటే 12 లక్షల రూపాయలు. ఈన పోయిరానీకి ఫస్ట్ క్లాస్ టికెట్. రెండేండ్ల కింద నేను రూ.8 లక్షలు పెట్టుకొని పోయొచ్చినా. ఈనతోటి మళ్లా టీం ఉంటది. ఆడ హోటల్ల ఖర్చు.. తిరుగుడు ఖర్చు.. పోరంబోగు ఖర్చు.. కోట్ల రూపాలు నాశనం. దేశంల ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి 13 వేల డాలర్లు తగలవెట్టిండు అని ఆయన మండిపడ్డారు.
అధికారం కోసం ఆడాల్సిన అబద్దాలన్నీ ఆడారు..
ఈన గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు. మోదీ దగ్గర వోయి గంటసేపు కూసో. పాలన మొత్తం నేర్పిచ్చి తోలుతడు. 13 వేల డాలర్లు కాదు ఉల్టా నాలుగు రూపాలిచ్చి పంపుతడు. చెత్త రాజకీయాలు చేయకు. జూన్ 2 నాడు సంక్షేమం, అభివృద్ధి, రైతులు, యువత, బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమట. అధికారం రావడానికి ఎన్ని అబద్దాలు ఆడాల్నో అన్ని ఆడారు అని ధర్మపురి ఎద్దేవా చేశారు.
గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు కూడా స్కీమ్‌లు పెట్టొచ్చు..
అధికారంలోకి రాంగనే గింత అప్పు ఉందని నాకు తెల్వదు.. ఏం జేయాలే అని అన్నింటికి పంగనామాలు పెట్టుడు మళ్ల. గవర్నమెంట్ నడుస్తుంటే కూడా స్కీమ్‌లు పెట్టొచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ మ్యానిఫెస్టోల పెట్టలే. ఇండియాల ప్రతి సిటిజన్‌కు రూ.5 లక్షల బీమా ఇస్తున్నడు. చనిపోతే లక్ష రూపాల స్కీమ్ ఉన్నది. ఆడ లక్షలు ఇస్తున్నరు. నువ్ ఇచ్చేది వేలల్ల అని పేర్కొన్నారు.
నీ మార్కెటింగ్ మంత్రి ఏం జేస్తుండు. ఎన్ని మీటింగులు వెట్టిండు. ఎగుమతిదారులను ఎందర్ని పిలిచిండు. వినియోగదారులకు ఏం జెప్పిండు. ఏ దేశానికి వోయిండు. ఏ మార్కెట్‌ను డెవలప్ చేసిండు. నీ ఫార్మర్ లోన్ ఏమైంది. 80 శాతం మందికి రాలే ఇంకా. ఫీజు రీయంబర్స్ మెంట్ ఏమైంది. నువ్ సదువే చెప్పుతలేవ్. నీ నిరుద్యోగ భృతి ఏమాయే? ఇవన్నీ నీ హామీలే కదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరవింద్ నిలదీశారు.
కేసీఆర్‌కు ఉద్యమ చరిత్ర ఉంది..
తెలంగాణ ఉద్యమంల ఒక్కనాడన్నా స్టేట్‌మెంటన్నా ఇచ్చిండా.. ఆ పోయినోడు గవర్నెన్స్ సక్కగ లేకుండే పోయిండు. కనీసం కేసీఆర్ కు ఉద్యమ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీవాళ్లకు సిగ్గుండాలే. సోనియాగాంధీని తిట్టినోన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిండ్రు. బీఏ చదివినా అని చెప్పుతడు ఇంకా. ఏం పండించాలి. ఏం ఎగుమతి చేయాలి.. ఏం తెల్వదు. ఏమన్నా సైంటిఫిక్ స్టడీ చేసినవా? చేస్తే రిపోర్టు పెట్టు. ఇప్పడిదాకా ఏమేం హోంవర్క్ చేసినవో రిపోర్ట్ పెట్టు.. బీడీలు తగ్గిపోతున్నయ్. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏం ఉపాయం చేసినవో చెప్పు అని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
అవులగాడు రాసిస్తే ఈడు సదువుతడు..
ఆడెవడో అవులగాడు స్పీచ్ రాసిస్తే ఈడు సదువుతడు. జూన్ 2న నాడు ఎండగొడుతుందని 10 పేజీలు సదివి ఇంకో ఐదు పేజీలు పెండింగ్ పెట్టి పోయిండు. గ్రామీణాభివృద్ధికి ఏం కార్యాచరణ చేసినవో చెప్పు? ఏ డైరెక్షన్‌ల పోతుర్రో కనీసం మాట్లాడు. విస్తీర్ణత పెంచుకొని ఏం లాభంరా నాయనా.. నువ్ కొంటనేలేవ్. మక్కకు రేటే వస్తలేదు. పశుసంపదలో ఏం వృద్ధి చేసినవో డాక్యుమెంట్ రిలీజ్ చెయ్. ఒక్క కొత్త పంట తెచ్చిండా ఈనా? అని ప్రశ్నించారు.
నేన్ బల్లగుద్ది చెప్తా.. పసుపు 15 వేల యావరేజ్‌కు అమ్ముతున్నం..
రైతు రుణమాఫీ ఒక 25 శాతమో ఏమో చేసిండ్రు సరే.. 75 శాతం పంగనామాలు పెట్టిండు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ ఇస్తున్నది. దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్ ఏమన్నా చేసినవా? అసలు నీకు ఆలోచన ఉందా? నేన్ బల్లగుద్ది చెప్తా. పసువు యావరేజ్‌ను 5 వేలది 15 వేలకు అమ్ముతున్నం. ఒక ఎంపీగా కొద్దో గొప్పో చేసినా. నేనేదో పెద్ద డబ్బా కొట్టుకుంటలే. రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంట మీద సోయి పెడితే 30 వేలు దాటుతది అని ఎంపీ ధర్మపురి హితవు పలికారు.
ఉచిత విద్యుత్తు..
కొత్త విద్యుత్తు ఏమన్నా ఉత్పత్తి చేద్దామంటే అది లేదు లొట్టపీసు.. కొనుక్కరావాలే. కొనేటప్పుడు పైసలు ఎక్కువ మాట్లాడుకోవాలే. కమీషన్లు మింగాలే. ఉచితంగ ఇస్తున్నమని చెప్పుకోవాలే. అదెప్పటినుంచో ఇస్తుర్రు. నువ్వేంది ఇచ్చేది?
కోటి మందిని కోటీశ్వరులను ఎట్ల చేస్తవో సాయంత్రం వరకు చెప్పు..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎట్ల చేస్తడు. సాయంత్రం వరకు చెప్పమను. ఏం ప్లానింగ్ చేసిర్రో రిలీజ్ చేయమను. లొట్టపీసు కూడా చేయలే. ఆ స్పీచ్ రాసేటోడు ఎవడో మళ్లా వచ్చే జూన్ 2కు ఎండకొడుతది.. స్పీచ్ తక్కవ రాయిమనుర్రి. ఎట్లాగో అబద్దాలు రాసేదే.
ఏబీవీపీల ఏం పీకలే..
పెండింగ్ ప్రాజెక్టు గురించి ఒక్కటి చెప్పమను. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టి పోయిండు. కట్టినయే కూలిపోతున్నయ్. మరమ్మతుల పైసలు ఇస్తలేరు ఈ దరిద్రులు. ఇదీ మన ముఖ్యమంత్రి పరిస్థితి. రియల్ ఎస్టేట్ తప్పా ఏం రాదు. నాలుగు పార్టీలు మారిండు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మధ్యలో ఎటో పోయచ్చిండు. ఏబీవీపీల ఏం పీకలే. మళ్లా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నడా? కాంగ్రెస్ హైకమాండ్‌కు బుద్దుండాలే. కొడంగల్ ల ఎమ్మెల్యేగా గెలుస్తడేమో.. అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మను ఐదేండ్లు ఉపముఖ్యమంత్రిగా పని చేసిండు. ఈనను టీడీపీలకెంచి రాంగనే డైరెక్టు సీఎంగా పెట్టిర్రు ఎందుకో? అని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
- ●Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
- ●Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ
- ●KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
- ●TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..
- ●CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్

Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ

KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!



