Ponnam Prabhakar | సీతారాముల ఆశీస్సులుండాలి.. ప్రజలు సుఖశాంతులతో జీవించాలి: మంత్రి పొన్నం
Sri Rama Navami | సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆకాంక్షించారు. వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివార్చన స్టేజీ వద్ద సీతారాముల కల్యాణానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
త్రినేత్ర.న్యూస్: సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆకాంక్షించారు. శ్రీ రామ నవమి (Sri Rama Navami) సందర్భంగా శుక్రవారం వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివార్చన స్టేజీ వద్ద సీతారాముల కల్యాణానికి కుటుంబ సమేతంగా ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు(Silk garments) , తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు.

ప్రజలు, ప్రభుత్వంపై ఆశీస్సులుండాలి: ప్రభుత్వ విప్
సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన మాట్లాడుతూ.. కల్యాణానికి 50వేల భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శ్రీ శివ, శ్రీ సీతారాముల కల్యాణం వేడుకలు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని వివరించారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ.. చైర్మన్గా కే కేశవరావు
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



