Cricket | ఆసియాకప్‌లో భారత్ 234 పరుగుల తేడాతో భారీ విజయం
Cricket | దుబాయ్ (Dubai)లో జరుగుతున్న అండర్ - 19 (Under - 19) ఆసియాకప్ (Asia Cup) లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ (India) 234 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.
Cricket | ఆసియాకప్ (Asia Cup)లో భారత్ (India) భారీ విజయం సాధించింది. దుబాయి (Dubai)లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న అండర్ - 19 (Under - 19) ఆసియాకప్ 2025లో భాగంగా యూఏఈ (UAE), ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 234 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.
దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ మ్యాచ్ ప్రారంభమైన మూడో ఓవర్లోనే ఓపెనర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) 55 బంతుల్లోనే శతకం నమోదు చేయడంతో పాటు అరోన్ జార్జి, విహాన్ మల్హోత్రాలు హాఫ్ సెంచరీ సాధించాడు. వైభవ్ 95 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సులతో 171 పరుగులు చేయగా, అరోన్ జార్జి 73 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 69 పరుగులు, విహాన్ మల్హోత్రా 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 69 పరుగులు చేశారు. చివర్లో వికెట్ కీపర్ అభిజ్ఞాన్ ఖండూ 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 32 పరుగులు, కనిష్క్ చౌహాన్ 12 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సులతో 28 పరుగులు సాధించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
ఏ దశలోనూ పోటీ ఇవ్వని యూఏఈ
తరువాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన యూఏఈని పృథ్వీ మధు (87 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50), ఉద్దిశ్ సూరి (106 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78) ఆదుకున్నారు. ఆఫ్ సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ మధు అవుటవ్వడంతో సలేహ్ అమీన్‌తో కలిసి సూరి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నాడు. కానీ భారత్ స్కోరులో కనీసం సగం కూడా చేయలేకపోయారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



