Cold Waves | వచ్చే మూడు రోజులు జాగ్రత్త….
Cold Waves | | తెలంగాణ (Telangana)లో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది.
Cold Waves | | తెలంగాణ (Telangana) రాష్ట్రం చలిగాలుల (Cold Waves)కు వణికిపోతోంది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది (Warning). దాదాపు పదిహేనేళ్ల క్రితం ఒక సంవత్సరం మాత్రం ఇంత కనిష్ట ఉష్ణోగ్రతలు (Lowest Temperatures) నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు, ఆ తరువాత ఇప్పటివరకు అలాంటి పరిస్థితి లేదని వివరిస్తున్నారు.
పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెండ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వచ్చే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకు తగ్గాయని పేర్కొంది.
అత్యల్పంగా 6.1 డిగ్రీలు
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.1 డిగ్రీలుగా నమోదైంది. కుమ్రమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.8 డిగ్రీలు, పటాన్‌చెరులో 7 డిగ్రీలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 7.2 డిగ్రీలు, రాజేంద్రనగర్ 8.3 డిగ్రీలు, మౌలాలి 8.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



