Talasani Srinivas Yadav | ఉన్న సిటీలో నీళ్లిస్తలేరు.. ఇంకా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తరా?
Talasani Srinivas Yadav | ఉన్న సిటీలో నీళ్లయ్యడానికి చేతగాదు కానీ ఇంకా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తారా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీలకు, బీఆర్ఎస్‌కు వ్యత్యాసం ఉందన్నారు.
- కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే రేవంత్‌కు సీఎం పదవి ఎక్కడిది?
- బీఆర్ఎస్ హయాంలోనే ఖైరతాబాద్ అభివృద్ధి జరిగింది
- జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
- ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో తలసాని పిలుపు
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: ఉన్న సిటీలో నీళ్లయ్యడానికి చేతగాదు కానీ ఇంకా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తారా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీలకు, బీఆర్ఎస్‌కు వ్యత్యాసం ఉందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలన్నారు.

ఎంతో చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ గులాబీ పార్టీ. ఎంతో గౌరవ ప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి ఏం భాష మాట్లాడుతున్నారు? 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటైంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై పోరాటం జరిపిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉంది. దేశ చిత్రపటంలో తెలంగాణను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు పదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశంలోనే ఆదర్శంగా నిలిపిన చరిత్ర కేసీఆర్ ది అని తలసాని గుర్తు చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోదే. ఖైరతాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా వ్యవహరించాలి. ప్రజాదరణ పొందిన వారికే పార్టీలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ప్రజా సమస్యలపై పోరాడాలి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Golconda Murder Case | చెల్లెలి ప్రేమ వివాహం.. పగతో రగిలిన అన్న..
జూన్ 15, 2026

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



