Babli Project | బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత..
Babli Project | ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జులై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం ఉదయం ఎత్తేశారు.
Babli Project | త్రినేత్ర.న్యూస్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జులై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం ఉదయం ఎత్తేశారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కలిసి 14 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు ఈ గేట్లను తెరిచి ఉంచుతారు.
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద 2.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గేట్లు ఏటేటా జూలై 1న ఎత్తి నీటిని వదలాలని సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ బాబ్లీ ప్రాజెక్టుపై కోర్టులకు వెళ్లాయి. అప్పట్లో సుప్రీంకోర్టు ఏటా జూలై 1నుంచి అక్టోబర్ 28 వరకు 14గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశించింది. వర్షాకాలంలో నది నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూడాలని సూచించింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ప్రతి ఏడాది బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు.
ఎస్సారెస్పీలోకి బాబ్లీ నీరు
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంది. గేట్లు ఎత్తగానే బాబ్లీ ప్రాజెక్టు నీరు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలోకి వెళ్తుంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి వరకు నీరు చేరాలంటే కొంతసమయం పడుతుంది.
తాజావార్తలు
- ●Nayara Energy | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు
- ●EV Charging | ఈవీల ఛార్జింగ్లకు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్గ్రేడ్ అవసరం..
- ●Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?
- ●VB-G RAM G | ఏపీలో రూ.312, తెలంగాణలో రూ.308.. వీబీ జీరామ్జీ చట్టం కింద చెల్లించే వేతనాలను ఫిక్స్ చేసిన కేంద్రం
- ●Mahesh Kumar Goud | బీజేపీ నేతలు ఓట్ల దొంగలు.. మీనాక్షి సీటు చోరీ చేశారు : టీ పీసీసీ చీఫ్

Nayara Energy | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు

EV Charging | ఈవీల ఛార్జింగ్లకు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్గ్రేడ్ అవసరం..

Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచర్లు అదిరిపోయాయి..

Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?






