త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad | శంషాబాద్ విమానాశ్ర‌యానికి మ‌రోసారి బాంబు బెదిరింపు

Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్ర‌యం (Airport) నుంచి అమెరికా వెళ్లే విమానంలో బాంబు (Bomb Threat) ఉందంటూ మెయిల్ వ‌చ్చింది. అడిగినంత సొమ్ము ఇవ్వ‌క‌పోతే విమానాన్ని పేల్చేస్తామ‌ని బెదిరించారు.

A

News | Published On Dec 9, 2025, 10.56 am IST

Shamshabad | శంషాబాద్ విమానాశ్ర‌యానికి మ‌రోసారి బాంబు బెదిరింపు
Advertisement

Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్ర‌యానికి మ‌రోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వ‌చ్చింది. విమానాశ్ర‌యం (Airport) నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ అధికారుల‌కు మెయిల్ (Mail) రావ‌డంతో భ‌ద్ర‌తా అధికారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. బాంబు పేల‌కుండా ఉండాలంటే మిలియ‌న్ డాల‌ర్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అడిగిన‌న్ని డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే విమానం పైకెగిరిన ప‌ది నిమిషాల్లో బాంబు పేలుస్తామంటూ బెదిరించారు. వెంట‌నే రంగంలోకి దిగిన భ‌ద్ర‌తా సిబ్బంది విమానాశ్ర‌యం మొత్తం త‌నిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) బృందాల‌తో విమానాశ్ర‌యంతో పాటు, అమెరికాకు వెళ్లే అన్ని విమానాల‌లో ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు.

మెయిల్ చేసిన వ్య‌క్తిని గుర్తించిన పోలీసులు

శంషాబాద్ విమానాశ్ర‌యానికి బాంబు బెదిరింపు మెయిల్ చేసిన వ్య‌క్తిని పోలీసులు గుర్తించారు. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన జాస్ప‌ర్ ప‌కార్ట్ ఈ మెయిల్ పంపించిన‌ట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్ర‌యానికి వ‌రుస బాంబు బెదిరింపులు

శంషాబాద్ (Shamshabad) విమానాశ్ర‌యానికి బాంబు బెదిరింపులు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల విమానాశ్ర‌యంలో బాంబులు ఉన్న‌ట్లు బెదిరింపు రాగా, సోమ‌వారం ఉద‌యం విమానాశ్ర‌యానికి రానున్న మూడు విమానాల్లో బాంబులు ఉన్న‌ట్లు బెదిరింపు వ‌చ్చింది. తాజాగా మంగ‌ళ‌వారం అమెరికా వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. వ‌రుస బెదిరింపుల‌తో ప్రయాణీకులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement