త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jiyaguda | జియాగూడ‌లో క‌ల్తీ దందా.. కుళ్లిన స‌మోసాలు, ప‌ఫ్స్ త‌యారీ

Jiyaguda | పార్సీగుట్ట‌లో కుళ్లిన చికెన్ దొరికిన ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే జియాగూడ (Jiyaguda) లో కల్తీ సమోసా (Rotten samosa) తయారీ బ‌య‌ట ప‌డింది. హైదరాబాద్ సిటీ పోలీస్, టాస్క్ ఫోర్స్‌ కుల్సుంపురా పోలీసులు స‌మోసా త‌యారీ కేంద్రంపై శ‌నివారం మెరుపు దాడులు చేశారు. పాడైన గుడ్లు, నాణ్య‌త లేని నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు తేలింది.

S

News | Published On Mar 21, 2026, 4.11 pm IST

Jiyaguda | జియాగూడ‌లో క‌ల్తీ దందా.. కుళ్లిన స‌మోసాలు, ప‌ఫ్స్ త‌యారీ
Advertisement

- పోలీసుల దాడుల‌తో బ‌ట్ట‌బ‌య‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో క‌ల్తీ దందా క‌ల‌క‌లం రేపుతోంది. పార్సీగుట్ట‌లో కుళ్లిన చికెన్ దొరికిన ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే జియాగూడ (Jiyaguda) లో కల్తీ సమోసా (Rotten samosa) తయారీ బ‌య‌ట ప‌డింది. హైదరాబాద్ సిటీ పోలీస్, టాస్క్ ఫోర్స్‌ కుల్సుంపురా పోలీసులు స‌మోసా త‌యారీ కేంద్రంపై శ‌నివారం మెరుపు దాడులు (Rides) చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ట్రేడ్‌ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, నాణ్య‌త లేని నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు తేలింది.

అబ్దుల్ రషీద్ (Abdul Rasheed) ఆహార ప‌దార్థాల త‌యారీకి కుళ్లిన గుడ్లు, రోజుల త‌ర‌బ‌డి మరిగించిన నూనెను ఉపయోగిస్తున్నాడు. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్‌ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో కల్తీ ఆహారాన్ని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని డిప్యూటీ కమిషనర్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement