త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | క్రిస్మ‌స్ పండుగకు వేలాంకినికి ప్ర‌త్యేక రైలు

Special Trains | క్రిస్మ‌స్ (Christmas) పండుగ వేడుకల నేప‌థ్యంలో వేలాంకిని వెళ్లే ప్ర‌యాణీకులకు ప్ర‌త్యేక రైలు (Special Trains) న‌డుపనున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌క‌టించింది.

A

News | Published On Dec 22, 2025, 8.30 pm IST

Special Trains | క్రిస్మ‌స్ పండుగకు వేలాంకినికి ప్ర‌త్యేక రైలు
Advertisement

Special Trains | క్రిస్మ‌స్ (Christmas) పండుగ వేడుకల నేప‌థ్యంలో వేలాంకిని వెళ్లే ప్ర‌యాణీకులకు రైల్వే (Railway) అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వేలాంకిని వెళ్లే వారి కోసం ప్ర‌త్యేక రైలు (Special Trains) న‌డుపనున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌క‌టించింది. పండ‌గ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23న ఈ రైలును న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తిరిగి ఈ రైలు 25న వేలాంకిని నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. 23న సికింద్రాబాద్ నుంచి సాయంత్రం ఏడు గంట‌ల 25 నిమిషాల‌కు ప్రారంభ‌మ‌య్యే రైలు మ‌రుస‌టి రోజు సాయంత్రం అయిదున్న‌ర గంట‌ల‌కు వేలాంకినికి చేరుతుంది. 25న ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు వేలాంకిని నుంచి ప్రారంభ‌మ‌య్యే రైలు మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరు గంట‌ల ప‌ది నిమిషాల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభ‌మైన అనంత‌రం చెర్ల‌ప‌ల్లి, న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, తెనాలి, బాప‌ట్ల‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మూర్‌, తాంబ‌రం, చెంగ‌ల్‌ప‌ట్టు, మెల్మ‌రువ‌త్తుర్‌, విల్లుపురం, తిరుప్ప‌దిరిపులియూర్‌, చిదంబ‌రం, మ‌యిల‌దుతురై, క‌రైక‌ల్‌, నాగోర్‌, నాగ‌పట్ట‌ణం స్టేష‌న్ల‌లో ఆగుతుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ ప్ర‌త్యేక రైలులో సెకండ్ క్లాస్‌ జ‌న‌ర‌ల్‌, స్లీప‌ర్‌, థ‌ర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయ‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement