Indian Railways | ఆ మూడు ప్రత్యేక రైళ్లు.. ఇక సాధారణ రైళ్లు..
Indian Railways | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్( Indian Railways ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు కూడా హైదరాబాద్( Hyderabad ) నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
Indian Railways | త్రినేత్ర.న్యూస్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్( Indian Railways ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు కూడా హైదరాబాద్( Hyderabad ) నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
కాచిగూడ - మధురై స్పెషల్(07191/07192) ను కాచిగూడ - ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్(17165/17166) గా మార్చారు. ఈ రైలు ప్రతి సోమవారం కాచిగూడలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి, మంగళవారం రాత్రికి ట్యుటికోరిన్‌కు చేరుకోనుంది. మళ్లీ బుధవారం ఉదయం కాచిగూడకు బయల్దేరనుంది.
అదే విధంగా హైదరాబాద్ - కన్యాకుమారి స్పెషల్ (07230/07229) ను హైదరాబాద్ - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (17069/17070) గా మార్చినట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. వారానికోసారి రెండు సిటీల మధ్య రాకపోకలు కొనసాగించనుంది.
చర్లపల్లి - షాలిమార్ స్పెషల్ (07225/07226) ను చర్లపల్లి - షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్(17065/17066) గా మార్చారు. ప్రతి మంగళవారం ఉదయం చర్లపల్లి నుంచి బయల్దేరి బుధవారం షాలిమార్ చేరుకోనుంది.
2014 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్ 91 కొత్త రైలు సర్వీసులను హైదరాబాద్ కేంద్రంగా నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




