త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshwar Reddy | దానం నాగేంద‌ర్‌పై హైకోర్టులో పిటిష‌న్.. స్పీక‌ర్ తీర్పును స‌వాలు చేసిన మ‌హేశ్వ‌ర్‌రెడ్డి

Maheshwar Reddy | ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త‌పై హైకోర్టు (High court)లో పిటిష‌న్ (petition) దాఖ‌లైంది. బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడు, ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (MLA Maheshwar Reddy) దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త‌ (Ineligibility) పై హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశముంది.

S

News | Published On Mar 21, 2026, 6.31 pm IST

Maheshwar Reddy | దానం నాగేంద‌ర్‌పై హైకోర్టులో పిటిష‌న్.. స్పీక‌ర్ తీర్పును స‌వాలు చేసిన మ‌హేశ్వ‌ర్‌రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త‌పై హైకోర్టు (High court)లో పిటిష‌న్ (petition) దాఖ‌లైంది. బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడు, ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (MLA Maheshwar Reddy) దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త‌ (Ineligibility) పై హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశముంది. దానం అన‌ర్హ‌త పిటిష‌న్‌పై ఇటీవ‌ల‌ విచార‌ణ జ‌రిపిన అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్ తీర్పు వెలువ‌రించారు. దానం పార్టీ మారాడ‌నేందుకు ఎటువంటి ఆధారాలు లేవ‌ని, ఆయ‌న పార్టీ మార‌లేద‌ని స్పీక‌ర్ తన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement