త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసు ద‌ర్యాప్తు అధికారుల కీల‌క స‌మావేశం

A

News | Published On Dec 21, 2025, 5.37 pm IST

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసు ద‌ర్యాప్తు అధికారుల కీల‌క స‌మావేశం
Advertisement

Phone Tapping | రాష్ట్రంలో రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ద‌ర్యాప్తు చేస్తున్న స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) (SIT) అధికారుల కీల‌క స‌మావేశం ఆదివారం జ‌రిగింది. ఈ కేసుతో సంబంధ‌మున్న ప్ర‌తి ఒక్క‌రిని విచారించాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. అనంత‌రం న్యాయ‌స్థానంలో పూర్తి స్థాయి చార్జ్‌షీట్ (Chargesheet) దాఖ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది.

కేసును స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపేందుకు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ (Commissioner) వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar) నేతృత్వంలో ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తొమ్మిది మంది పోలీసు అధికారుల‌ను సిట్‌లో స‌భ్యులుగా నియ‌మిస్తూ ఇటీవ‌లే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సిద్దిపేట క‌మిష‌న‌ర్ విజ‌య్‌కుమార్‌, రామ‌గుండం క‌మిష‌న‌ర్ అబ‌ర్ కిషోర్ ఝా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్‌, మ‌హేశ్వ‌రం డీసీపీ నారాయ‌ణ‌రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ క‌మాండ‌ర్ ర‌వీంద‌ర్‌రెడ్డి, రాజేంద్ర‌న‌గ‌ర్ అడిష‌న‌ల్ డీసీపీ కేఎస్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంక‌ట‌గిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ జీహెచ్ శ్రీ‌ధ‌ర్‌, హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేంద‌ర్‌రావుల‌ను సిట్ స‌భ్యులుగా నియ‌మించారు.

న‌గ‌రంలోని పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో సిట్ అధికారులతో స‌జ్జ‌నార్ భేటీ అయ్యారు. విచార‌ణ తీరుతెన్నుల‌పై వారికి దిశానిర్దేశం చేశారు.
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ద‌ర్యాప్తు చేస్తున్న స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) (SIT) అధికారులు స‌మావేశ‌మై కేసుతో సంబంధ‌మున్న ప్ర‌తి ఒక్క‌రిని విచారించాల‌ని నిర్ణయించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement