త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIT for investigate social media posts | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ద‌ర్యాప్తుకు ఏర్పాటు

SIT for investigate social media posts | బండి భ‌గీర‌థ్ పోక్సో కేసులో పోలీసులు దూకుడు పెంచారు. హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో వ‌చ్చిన‌ అనుచిత పోస్టులపై దర్యాప్తు చేప‌ట్టేందుకు మ‌రో సిట్ ఏర్పాటైంది. జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు.

S

Telangana | Published On May 19, 2026, 12.52 pm IST

SIT for investigate social media posts | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ద‌ర్యాప్తుకు ఏర్పాటు
Advertisement
  • ఇక‌ అనుచిత పోస్టులు పెడితే ఊచ‌లే
  • జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ఏర్పాటు

SIT for investigate social media posts | త్రినేత్ర‌.న్యూస్‌: బండి భ‌గీర‌థ్ పోక్సో కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించిన ప్ర‌తి విష‌యంలో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేస్తున్నారు. ఇటీవ‌ల హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో వ‌చ్చిన‌ అనుచిత పోస్టులపై దర్యాప్తు చేప‌ట్టేందుకు మ‌రో సిట్ ఏర్పాటైంది. ఇక సోష‌ల్ మీడియాలోని అనుచిత‌ పోస్టుల‌పై ఉక్కుపాదం మోప‌నున్నారు. జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు.

జడ్జిపై అనుచిత పోస్టుల వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాయసం దామోదర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దామోదర్‌ను నెల్లూరులో అరెస్టు చేశారు. బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, హైకోర్టు జడ్జి భర్తకు ఛైర్మన్ పదవి ఇస్తారంటూ పోస్టు పెట్టిన విష‌య‌మై హైకోర్టు రిజిస్ట్రార్ రాయసం దామోదర్‌పై సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. మరికొందరిపై సైతం పోలీసుకు కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రోవైపు భగీరథ్‌ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నేడు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్నాక అతని వాంగ్మూలం కూడా నమోదు చేయనున్నారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ ఎప్పటికప్పుడు ఈ కేసును దర్యాప్తును సమీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement