త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhagirath | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు

Bandi Bhagirath | బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) పోక్సో కేసులో ప్ర‌భుత్వం మరో సిట్‌ను (SIT) ఏర్పాటు చేసింది. హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో (Social Media Posts) అనుచిత పోస్టులపై దర్యాప్తు కోసం జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియ‌మించింది.

G

Telangana | Published On May 19, 2026, 12.27 pm IST

Bandi Bhagirath | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు
Advertisement

Bandi Bhagirath | త్రినేత్ర‌.న్యూస్‌: బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) పోక్సో కేసులో ప్ర‌భుత్వం మరో సిట్‌ను (SIT) ఏర్పాటు చేసింది. హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో (Social Media Posts) అనుచిత పోస్టులపై దర్యాప్తు కోసం జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియ‌మించింది. సోషల్ మీడియా పోస్టులపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయ‌నున్నారు. కాగా, జడ్జిపై అనుచిత పోస్టుల వ్యవహారంలో ప్రధాన నిందితుడు దామోదర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరికొందరిపై కేసు నమోదు చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..

పోక్సో కేసు (POCSO Case) నిందితుడు బండి భ‌గీర‌థ్ ముందస్తు బెయిల్ విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళా జ‌డ్జిపై ప‌లువురు అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మెన్ పోస్ట్ ఇస్తారని ప్రచారం చేశారు. కేసు విచారణ సందర్భంలోనూ ఈ సోషల్ మీడియా పోస్టులపై జడ్జి మాధవి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఈ క్ర‌మంలో స్పందించిన‌ హైకోర్టు రిజిస్ట్రార్.. ఇది న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ చార్మినార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంలో లోతైన ద‌ర్యాప్తు కోసం ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement