త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIT | భ‌గీర‌థ్ కేసుపై ‘సిట్’ ఏర్పాటు.. కూక‌ట్‌ప‌ల్లి డీసీపీ రితిరాజ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌

SIT | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Banadi Bhagirath) పోక్సో కేసు వ్యవహారంలో మహిళా ఐపీఎస్ పర్యవేక్షణలో తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Rithiraj) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

S

News | Published On May 11, 2026, 4.26 pm IST

SIT | భ‌గీర‌థ్ కేసుపై ‘సిట్’  ఏర్పాటు.. కూక‌ట్‌ప‌ల్లి డీసీపీ రితిరాజ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
Advertisement

SIT | త్రినేత్ర‌.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Banadi Bhagirath) పోక్సో కేసు వ్యవహారంలో మహిళా ఐపీఎస్ పర్యవేక్షణలో తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Rithiraj) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌ను రితిరాజ్‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు డీజీపీ పేర్కొన్నారు.

ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసిన బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్‌...

పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో బండి భ‌గీర‌థ్ మీద‌ న‌మోదైన ఫోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి వివ‌రాలు తెప్పించుకుని విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement