మెస్సీతో ఆడుకున్న సీఎం రేవంత్ మనవడు
సీఎం రేవంత్ రెడ్డి మనవడు కూడా మెస్సీతో ఫుట్‌బాల్ ఆడుకున్న తర్వాతే షో సమాప్తమైంది
మెస్సీతో ఆడుకున్న సీఎం రేవంత్ మనవడు
త్రినేత్ర.న్యూస్: ఫుట్‌బాల్ ఆటలో దిగ్గజం, రికార్డుల శిఖరం లియెనెల్ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. GOAT పర్యటనలో భాగంగా శనివారం (2025 డిసెంబర్ 13) ఉప్పల్ స్టేడియం మెస్సీ నినాదాలతో హోరెత్తిపోయింది. సింగరేణి ఆర్ ఆర్ - అపర్ణ మెస్సీ జట్ల మధ్య జరిగిన పోటీలో మెస్సీ కేవలం రెండంటే రెండే నిమిషాలు బాల్ అటూ ఇటూ ఆడించారు. ఆ తర్వాత రెండు జట్ల ప్లేయర్లతో, సీఎంతో గ్రౌండ్‌లో ఓ మూలన ఫుట్‌బాల్ వామప్ చేశారు. ఆ తర్వాత ఫొటో సెషన్‌తో మెస్సీ మేనియా సమాప్తమైంది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కార్యక్రమం అంచనాలను మించి అలరించి హైదరాబాద్‌కు ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
రెండే నిమిషాలు.. కీపర్‌లేని పోస్టుకు గోల్
మెస్సీ వస్తున్నాడనగానే యావత్ మీడియా అంతా అనేక అంచనాలను ప్రేక్షకుల నెత్తిన కుమ్మరించింది. కానీ వాస్తవానికి మెస్సీ అడిందంతా రెండు నిమిషాలలోపే. అదీ ఓ వామప్ యాక్టివిటీ. అంటే ఫుట్‌బాల్‌ను కొద్దిసేపు ఒకరినొకరు అటూ ఇటూ పాస్ చేసుకుంటారు. అలా జరిగిన తర్వాత చివరగా మెస్సీ ఓ గోల్ కొట్టాడు. ఆ గోల్ కొడుతున్న సమయంలో గోల్ పోస్ట్ వద్ద ఏ ఒక్కరూ లేరు. ఆ తర్వాత ఆ మ్యాచ్ అయిపోయిందనిపించి మళ్లీ వామప్ చేశారు.
ఆ చిన్న పిల్లాడు ఎవరంటూ..
సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుట్‌బాల్ వామప్ జరుగుతుండగా హఠాత్తుగా ఓ మూడు-నాలుగేళ్ల బుడతడు ప్రత్యక్షమయ్యాడు. నేరుగా సీఎం పక్కనే వచ్చి నిలబడి ఆడుతుండడంతో ప్రొఫెషనల్‌గా కామెంటరీ చేస్తున్న వ్యాఖ్యాత అదొగ గొప్ప విశేషంగా అనుభూతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత చిన్న పిల్లవాడికి కూడా మెస్సీతో ఆడించడం చూసి.. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎంత సంతోషించి ఉంటారోనని ఆనందపడిపోతూ వ్యాఖ్యానించాడు. కానీ ఆ బుడతడు సీఎం మనవడు అని ఆ వ్యాఖ్యాతకు తెలియరాలేదు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మనవడు కూడా మెస్సీతో ఫుట్‌బాల్ ఆడుకున్న తర్వాతే షో సమాప్తమైంది. ఆ తర్వాత కొద్ది సేపు ఫొటో సెషన్ నడిచిన తర్వాత ఉప్పల్ స్టేడియం ఖాళీ అయ్యింది
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



