Yoga | యోగా వేడుకల్లో అటవీ సిబ్బంది.. ప్రత్యేక ఆకర్షణగా ఏనుగులు.. వీడియో
Yoga | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా (International Yoga Day) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జల్దపార నేషనల్ పార్కులో (Jaldapara National Park) ప్రకృతి ఒడిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి.
Yoga | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా (International Yoga Day) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెడ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 35 వేల మందితో కలిసి ప్రధాని యోగాసనాలు (Yoga) వేశారు. అయితే రాష్ట్రంలోని జల్దపార నేషనల్ పార్కులో (Jaldapara National Park) ప్రకృతి ఒడిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. యోగా కార్యక్రమంలో అటవీ సిబ్బందితోపాటు ఏనుగులు (Elephants) కూడా పాల్గొనడమే దీనికి కారణం.

నేషనల్ పార్కులోని నదీ తీరంలో అటవీ శాఖ సిబ్బంది యోగాసనాలు వేశారు. సమీపంలో నిలబడిన ఏనుగులు.. మావటిల సూచనలను పాటిస్తూ తమ శరీర భాగాలను, చెవులనూ కదిలిస్తూ కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జల్దపార నేషనల్ పార్క్..
జల్దపార జాతీయ పార్కు.. 216 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇది పచ్చికభూములు, జీవనదులు, ఇసుకతో కూడిన నదీ తీరాలు, పొడవైన గడ్డితో నిండి ఉంది. 1941లో భారతీయ ఒంటికొమ్ము ఖడ్గమృగాల (One-Horned Rhino) రక్షణ కోసం దీనిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. 2012లో జాతీయ పార్కుగా రూపాంతరం చెందింది. ఇది బైసన్లు (అడవి దున్నలు), హిస్పిడ్ హేర్ (ఒక రకమైన కుందేలు), హాగ్ డీర్, సాంబార్ జింకలు, ఆసియా ఏనుగుల వంటి అనేక జంతువులకు నిలయంగా ఉంది. ఇక పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం ఒక స్వర్గధామంగా పేరొందింది. ఇక్కడ వివిధ రకాల డేగలు, బెంగాల్ ఫ్లోరికన్, ఇండియన్ హార్న్‌బిల్, అడవి కోళ్లు, నెమళ్లు, కౌజు పిట్టలు వంటి ఎన్నో రకాల పక్షులు ఆకాశంలో విహరిస్తూ కనివిందు చేస్తాయి.
Yoga in the Jaldapara Wildlife Division
Where elephants walk with wisdom and we breathe with balance: Celebrating International Day of Yoga. Mats met grasslands as the elephants of Jaldapara watched from a respectful distance. With elephant footsteps grounding the earth and Torsa… pic.twitter.com/TyUiKEQaDP— Department of Health & Family Welfare, West Bengal (@wbdhfw) June 20, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ లవ్‌స్టోరీ - హింట్ ఇచ్చేసిన యాంకర్ సుమ
- ●Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది
- ●Maa Inti Bangaram | సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Meenakshi Natarajan | తెలంగాణలో నాకు ఎవరి సీటూ వద్దు.. అంత అవసరం లేదు కూడా
- ●Ramchandar Rao | హామీలిచ్చుడే తప్ప..ఎప్పుడైనా నెరవేర్చారా? : రాంచందర్ రావు
- ●FIFA World Cup 2026 | జపాన్ మ్యాజిక్.. 4-0 తేడాతో ట్యునీషియా చిత్తు

Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ లవ్‌స్టోరీ - హింట్ ఇచ్చేసిన యాంకర్ సుమ

Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది

Maa Inti Bangaram | సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Meenakshi Natarajan | తెలంగాణలో నాకు ఎవరి సీటూ వద్దు.. అంత అవసరం లేదు కూడా






