త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Doval | బెదిరింపుల‌కు త‌లొగ్గం.. ట్రేడ్ డీల్ కోసం ట్రంప్ ప‌ద‌వీకాలం ముగిసే వ‌ర‌కూ వేచి చూస్తాం : అజిత్ దోవ‌ల్‌

Ajit Doval | అగ్ర‌రాజ్యం అమెరికా-భార‌త్ మ‌ధ్య ట్రేడ్ డీల్ (India-US trade deal) సంద‌ర్భంగా భార‌త్‌, అమెరికా అధికారుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు సంబంధించి కీల‌క వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి.

D

National | Published On Feb 5, 2026, 9.52 am IST

Ajit Doval | బెదిరింపుల‌కు త‌లొగ్గం.. ట్రేడ్ డీల్ కోసం ట్రంప్ ప‌ద‌వీకాలం ముగిసే వ‌ర‌కూ వేచి చూస్తాం : అజిత్ దోవ‌ల్‌
Advertisement

Ajit Doval | అగ్ర‌రాజ్యం అమెరికా-భార‌త్ మ‌ధ్య ట్రేడ్ డీల్ (India-US trade deal) కుదిరిన విష‌యం తెలిసిందే. భారత దిగుమతులపై ఉన్న ప‌రస్ప‌ర (రెసిప్రొకల్) టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌కు తెర‌ప‌డిన‌ట్లైంది. అయితే ఈ డీల్ సంద‌ర్భంగా భార‌త్‌, అమెరికా అధికారుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు సంబంధించి కీల‌క వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి.

భార‌త్‌, ప్ర‌ధాని మోదీపై అమెరికా ఉన్న‌తాధికారులు నోరుపారేసుకోవ‌డాన్ని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ (Ajit Doval) తీవ్రంగా ఖండించార‌ట‌. ఈ మేర‌కు ప్ర‌ముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బ‌ర్గ్ (Bloomberg) నివేదించింది. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని కూడా హెచ్చ‌రించిన‌ట్లు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ట్రంప్ వాణిజ్య స‌ల‌హాదారు న‌వారో స‌హా యూఎస్ ఉన్న‌తాధికారులు ప‌లుమార్లు భార‌త్‌పై బెదిరింపుల‌కు దిగిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, భార‌త్‌, ప్ర‌ధాని మోదీ ప‌ట్ల అనేక సంద‌ర్భాల్లో నోరు పారేసుకున్నారు.

ఈ క్ర‌మంలో గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio), అజిత్ దోవ‌ల్ మ‌ధ్య కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో భార‌త్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా తెలిపిన‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ వెల్ల‌డించింది. భార‌త్‌పై అమెరికా అధికారులు నోరుపారేసుకోవ‌డాన్ని దోవ‌ల్ తీవ్రంగా ఖండించిన‌ట్లు తెలిపింది. అంతేకాదు, అమెరికా బెదిరింపుల‌కు భార‌త్ త‌లొగ్గ‌ద‌ని, అవ‌స‌ర‌మైతే ట్రంప్ ప‌ద‌వీకాలం ముగిసే వ‌ర‌కూ వేచి చూసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామ‌ని నాడు మార్కో రుబియోతో దోవ‌ల్ స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది. భార‌త్‌, ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు త‌గ్గిస్తే మంచిద‌ని కూడా దోవ‌ల్ సున్నితంగా హెచ్చ‌రించిన‌ట్లుగా బ్లూమ్‌బ‌ర్గ్ పేర్కొంది.

Advertisement
Advertisement