Woman Reservation Bill | లోక్ సభలో ఎన్డీఏ ఓటమి.. కొత్త మహిళా బిల్లుకు నో
Woman Reservation Bill | లోక్ సభలో ఎన్డీఏ కూటమికి తీవ్ర శరాఘాతం. 2023 లో ఆమోదం పొందిన మహిళా బిల్లును 2011 జనగణన ఆధారంగా సవరిద్దామని ప్రయత్నించిన బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ రాకపోవడంతో మహిళా బిల్లు తిరస్కారానికి గురైంది.
పాత జనగణనతో డీలిమిటేషన్‌కు తిరస్కారం
బీజేపీ పక్షాలకు శరాఘాతం
వీగిపోయిన మహిళా బిల్లు
రాజ్యంగ సవరణకు ఒప్పుకోని విపక్షాలు
రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూల ఓట్లు 298
వ్యతిరేక ఓట్లు 230
ఇంకా అవసరమైనవి 54 ఓట్లు
మొత్తం హాజరైన సభ్యులు 528
Woman Reservation Bill | త్రినేత్ర.న్యూస్ : లోక్ సభలో ఎన్డీఏ కూటమికి తీవ్ర శరాఘాతం. 2023 లో ఆమోదం పొందిన మహిళా బిల్లును 2011 జనగణన ఆధారంగా సవరిద్దామని ప్రయత్నించిన బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ రాకపోవడంతో మహిళా బిల్లు తిరస్కారానికి గురైంది. లోక్ సభ లో సభ్యుల సంఖ్య 543 కాగా ఓటింగ్ లో కేవలం 528 మంది మాత్రమే పాల్గొన్నారు. వీరిలో మూడింటి రెండొంతుల సభ్యుల మద్దతు అంటే.. దాదాపు 352 ఓట్లు అవసరం ఉండగా బిల్లుకు మద్దతుగా కేవలం 298 ఓట్లు మాత్రమే పడ్డాయి. విపక్షాలన్నీ కలిపి బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు వేశాయి. ఇంకా 54మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా అది సాధ్యం కాకపోవడంతో బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లుకు అవసరమైన రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోవడంతో మిగతా 2 బిల్లులైన కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026, డీలిమిటేషన్ బిల్లు 2026 లను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
మొత్తం పడిన ఓట్లు - 528
అనుకూలం - 298
వ్యతిరేకం - 230
బిల్లు ఆమోదానికి అవసరమైనవి - 352
రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన ఓట్లు 2/3 మెజారిటీ - 352
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






