Kavitha | కవితకు ఈసీ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చుకోవాల్సిందే!
Kavitha | నూతన రాజకీయ పార్టీని స్థాపించి జనంలో దూసుకెళ్తున్న కల్వకుంట్ల కవితకు (Kavitha) కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ వచ్చేలా నామకరణం చేసిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
Kavitha | త్రినేత్ర.న్యూస్: నూతన రాజకీయ పార్టీని స్థాపించి జనంలో దూసుకెళ్తున్న కల్వకుంట్ల కవితకు (Kavitha) కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ వచ్చేలా నామకరణం చేసిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు లేఖ రాశారు. తమకు మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని, లేనట్లయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని స్పష్టం చేసింది. ఇందుకుగాను 15 రోజుల గడువు ఇచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2001లో `తెలంగాణ రాష్ట్ర సమితి` కేసీఆర్ (KCR) స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కూడా టీఆర్ఎస్ (TRS) గానే గుర్తింపు పొందింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఆ తర్వాత BRS (భారత రాష్ట్ర సమితిగా) రూపాంతరం చెందింది. అయితే అదే పార్టీని నుంచి బహిష్కరణకు గురైన కవిత.. టీఆర్ఎస్ అని వచ్చేలా తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) అని పేరు పెట్టారు.

దీనిపై ఆ పార్టీతోపాటు ప్రజలు, వివిధ వర్గాల నుంచి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో పాత పార్టీ పేరును తలపించేలా ఈ కొత్త పేరు ఉండటం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును కొనసాగించడం కుదరదని కవితకు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ ఫిర్యాదు
కవిత తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వాటిలో అధిక భాగం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అనుచరులు పంపినవేనని సమాచారం. టీఆర్ఎస్ పేరు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, 14 ఏండ్ల ఉద్యమ చరిత్రలో ఆ పేరుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తమ తమ అభ్యంతరాల్లో ప్రధానంగా ప్రస్తావించింది. అదేవిధంగా పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఇంకా టీఆర్ఎస్గానే పరిగణనిస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో అదే సంక్షిప్త నామాన్ని మరో రాజకీయ పార్టీకి కేటాయిస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అందువల్ల ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని ఈసీఐకి విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరం..
మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన సంస్థ..TRS అనే సంక్షిప్త నామాన్ని కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ సంస్థ తరఫున దయానంద్ మహాదేవ్ మామ్ డ్యాల్ అనే వ్యక్తి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో ప్రకటననూ ప్రచురించింది. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడడంపై రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాజ్య సమితి పార్టీ కూడా అభ్యంతరం తెలిపింది.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



