Technical Error | మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు జమ.. ఏం చేసిందంటే?
Technical Error | మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రూ.10 నోటు కనిపిస్తే ఏం చేస్తాం?.. చుట్టూ చూసి లటుక్కున జేబులో వేసుకుంటాం. అదే బ్యాంకు అకౌంట్‌లో మనవి కాని డబ్బు అనుకోకుండా వచ్చిపడితే.. వెంటనే విత్‌డ్రా చేసి ఖర్చు చేస్తాం.
Technical Error | త్రినేత్ర.న్యూస్: మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రూ.10 నోటు కనిపిస్తే ఏం చేస్తాం?.. చుట్టూ చూసి లటుక్కున జేబులో వేసుకుంటాం. అదే బ్యాంకు అకౌంట్‌లో మనవి కాని డబ్బు అనుకోకుండా వచ్చిపడితే.. వెంటనే విత్‌డ్రా చేసి ఖర్చు చేస్తాం. సహజంగా అంతా ఇలాగే చేస్తుంటారు.! కానీ ఓ మహిళా రైతు అలా ఆలోచించలేదు. సాంకేతిక సమస్య (technical Error) కారణంగా తన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిన రూ.10 కోట్లను అస్సులు ముట్టుకోలేదు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటుచేసుకుంది.
మెయిన్‌పురి జిల్లా దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన పరస్‌భన్ బహేలియా, రీటా (Rita) భార్యాభర్తలు. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆమె తన అకౌంట్‌లోని డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. అయితే సెలవు కావడంతో బ్యాంక్ మూసిఉంది. దీంతో పక్కనే ఉన్న ఏటీఎమ్ వద్దకు వెళ్లారు. బ్యాలెన్స్ చెక్‌చేసుకోగా తన అకౌంట్లో రూ.9,99,49,588 ఉన్నట్లు స్క్రీన్‌పై కనిపించింది. ఆశ్చర్యపోయిన రీటా.. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. దీంతో సమీపంలో ఉన్న మరో ఏటీఎంకు వెళ్లి.. మళ్లీ బ్యాలెన్స్ సూచుకున్నారు. అయితే ఈ సారి తాను చూసింది నిజమో కాదోనని నిర్ధారించుకునేందుకు తన ఫోన్‌లో వీడియో రికార్డు చేసింది. మరోసారీ అంతే మొత్తం చూపించడంతో.. తనది కాని డబ్బులో నుంచి ఒక్క పైసా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. తన అకౌంట్లో అంత డబ్బులు ఎందుకు పడ్డాయని తెలిసే వరకు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి తీయకూడదని స్పష్టం చేసింది. మరుసటి రోజు దంపతులిద్దరు కలిసి బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. బ్యాంక్ హాలీడే అని తెలిసి ఇంటికి తిరిగి వచ్చేశారు. కాగా, ఈ సంఘటనపై స్పందించిన బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్.. సాంకేతిక లోపం లేదా లావాదేవీలో పొరపాటు కారణంగా రీటా అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయని తెలిపారు. బ్యాంక్ తెరిచిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది. అంతా మహిళా రైతును పొగడ్తలతో ముంచెత్తారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






