త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఇండిగో విమానాల రద్దు, ఆలస్యానికి కొత్త నిబంధనలే కారణమా?

J

National | Published On Dec 4, 2025, 8.03 am IST

ఇండిగో విమానాల రద్దు, ఆలస్యానికి కొత్త నిబంధనలే కారణమా?
Advertisement

ఇండిగో విమాన సంస్థ గురించి తెలుసు కదా. బడ్జెట్ ధరలో విమాన టికెట్లు అందుబాటులో ఉండేది ఈ సంస్థలోనే. అందులోనూ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఇండిగో సర్వీసులనే ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ, రెండు రోజుల నుంచి మాత్రం ఇండిగో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం.. దేశ వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యంగా నడుస్తుండటం.

దానికి ప్రధాన కారణాలు పైలట్ల వర్కింగ్ అవర్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు రావడం, సిబ్బంది కొరత మరో ప్రధాన కారణంగా ఇండిగో యాజమాన్యం చూపెడుతోంది.

ఈ రెండు మూడు రోజుల్లోనే 200 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఎక్కువగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ రూట్లలో తిరిగే విమాన సర్వీసులపై ఈ ప్రభావం ఉంది.

పైలట్లు ఎక్కువ పని ఒత్తిడితో ఉంటున్నారని, వాళ్లకు పని భారం తగ్గించేందుకు ఎయిర్‌లైన్స్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆ మార్పులతో ఒక్కసారిగా ఇండిగో విమానాలకు సిబ్బంది కొరత ఏర్పడింది.

సాధారణంగా ఒక పైలట్ కు రాత్రి సమయంలో 6 ల్యాండింగ్స్ చేసే అనుమతి ఇదివరకు ఉండగా, కొత్త రూల్స్ ప్రకారం దాన్ని రెండుకు కుదించారు. పైలట్లకు ఇదివరకు విశ్రాంతి సమయం 36 గంటలు ఉండగా, ఇప్పుడు దాన్ని 48 గంటలకు పెంచారు.

గత వారం ఎయిర్‌బస్ విమానాల్లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్య వచ్చి కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల పైలట్ల డ్యూటీ టైమింగ్స్ మారి, ఆ పరిస్థితి అలాగే కంటిన్యూ అయి ఇదిగో ఇలా విమానాలు రద్దు అయ్యే వరకు తీసుకొచ్చాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement