త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akshita Dhankar | రిపబ్లిక్ డే వేడుకల్లో నారీ శక్తి: రాష్ట్రపతితో కలిసి జెండాను ఆవిష్కరించిన అక్షిత ధంకర్.. ఎవరీమె?

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత మహిళా అధికారులు చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి జెండాను ఆవిష్కరించిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షిత ధంకర్ నుంచి, పురుషుల దళానికి నాయకత్వం వహించిన సిమ్రాన్ బాలా వరకు.. కర్తవ్యపథ్‌లో నారీ శక్తి వెలుగొందింది.

J

National | Published On Jan 26, 2026, 12.03 pm IST

Akshita Dhankar | రిపబ్లిక్ డే వేడుకల్లో నారీ శక్తి: రాష్ట్రపతితో కలిసి జెండాను ఆవిష్కరించిన అక్షిత ధంకర్.. ఎవరీమె?

సంక్షిప్త సారాంశం

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షిత ధంకర్ రాష్ట్రపతితో కలిసి జెండాను ఆవిష్కరించి వార్తల్లో నిలిచారు. ఆమెతో పాటు సిమ్రాన్ బాలా, నికితా చౌదరి లాంటి మహిళా అధికారులు రక్షణ దళాలలో మహిళల ప్రాబల్యాన్ని చాటుతూ పరేడ్‌లో కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Akshita Dhankar | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత నారీ శక్తికి నిలువుటద్దంగా నిలిచాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నుంచి పరేడ్ విన్యాసాల వరకు మహిళా అధికారులు తమ సత్తా చాటారు.

ఎవరీ అక్షిత ధంకర్?

భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షిత ధంకర్ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించే అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకున్నారు.

హర్యానాలోని కాస్ని గ్రామానికి చెందిన అక్షిత, సైనిక కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి కూడా ఐఏఎఫ్ లో పనిచేశారు. ఢిల్లీలోని శ్రీ గురు తేగ్ బహదూర్ ఖల్సా కాలేజీలో చదువుతున్నప్పుడే ఎన్‌సీసీ (NCC) లో చేరి నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా వైమానిక దళంలో చేరిన అక్షిత, 2023లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కేవలం మూడేళ్లలోనే ఫ్లైట్ లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగి, నేడు దేశం గర్వించే స్థాయిలో నిలిచారు.

పురుషుల దళానికి నాయకత్వం

మరోవైపు సీఆర్‌పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సరికొత్త చరిత్ర సృష్టించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారిగా 140 మందికి పైగా పురుష జవాన్లతో కూడిన దళానికి ఆమె నాయకత్వం వహించారు. జమ్మ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల సిమ్రాన్, ఆ ప్రాంతం నుండి సీఆర్‌పీఎఫ్ లో ఆఫీసర్ హోదా పొందిన మొదటి మహిళ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

పరేడ్‌లో మెరిసిన మరికొందరు మహిళలు

వైమానిక దళ మార్చింగ్ దళానికి స్క్వాడ్రన్ లీడర్ నికితా చౌదరి నాయకత్వం వహించగా, ఐఏఎఫ్ బ్యాండ్‌లో మొదటిసారిగా 'అగ్నివీర్' మహిళలు కూడా భాగమయ్యారు. కర్తవ్యపథ్‌లో జరిగిన ఈ దృశ్యాలు భారతదేశ రక్షణ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎంతలా పెరుగుతుందో చాటిచెప్పాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement