Operation Sindoor | ఏ సవాల్ ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
Operation Sindoor | ఆపరేషన్ సింధూర్‌పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
Operation Sindoor | ఆపరేషన్ సింధూర్‌పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. సైన్యం చేపట్టిన ఈ చర్య భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ వ్యూహాత్మకత స్పష్టతను, సంసిద్ధతని ఆపరేషన్ సింధూర్ ప్రదర్శించిందన్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితులను ప్రస్తావించారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని. భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. సాధారణ పౌరుల నమ్మకాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు. చైనాతో సరిహద్దులో తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. సైనిక మోహరింపు సమతుల్యంగా, బలంగా ఉందని తెలిపారు. ఏ సవాల్ ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఆపరేషన్ సింధూర్‌ను ఖచ్చితత్వంతో నిర్వహించామన్నారు. గతేడాది మే 6-7 తేదీల మధ్య భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. సుమారు 22 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. నిర్ణయాత్మక ప్రతీకార చర్యలు ప్రారంభించాలని అత్యున్నత స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని జనరల్ ద్వివేది చెప్పారు. సైన్యం ఆపరేషన్ సిందూర్ కింద ఒక కచ్చితమైన వ్యూహాన్ని చేసిందని తెలిపారు. మే 7న, 22 నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. మే 7-10 మధ్య 88 గంటల పాటు ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ కొనసాగిందన్నారు. ఆపరేషన్ కింద ఉగ్రవాద స్థావరాల్లో తొమ్మిదింట్లో ఏడింటిని సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు.
పాక్‌లో ఇంకా ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎల్‌వోసీ, ఐబీ సరిహద్దుకు దగ్గరలో ఇవి ఉన్నాయని.. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే పరిస్థితికి తగ్గట్లుగా సైన్యం బదులిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రస్థావరాలపై డేగ కన్ను వేశామంటూ దాయాది దేశానికి హెచ్చరికలు చేశారు. శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా సమాచారం ఉందని తెలిపారు. కర్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. లోయలో ఉగ్రవాదం వైపు వెళ్లే వారి సంఖ్య తగ్గిదంటూ సంతోషం వ్యక్తం చేశారు. కశ్మీర్ ముఖచిత్రం మారుతోందని, టూరిజం వెల్లివిరుస్తోందని తెలిపారు. ఇందుకు అమర్‌నాథ్ శాంతియుతంగా జరుగడమే నిదర్శనమని చెప్పారు. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ధీటుగా బదులిస్తామన్నారు. పాక్ అణు బెదిరింపులను కొట్టిపడేశారు. ఆ దేశం నుంచి ఎదురయ్యే అణు ముప్పును నిర్వీర్యం చేశామన్నారు.
#WATCH | Delhi: Indian Army Chief General Upendra Dwivedi says, "Following the Pahalgam terror attack, a clear decision to respond decisively was taken at the highest level. Operation Sindoor was conceptualised and executed with precision. Through 22 minutes of initiation on 7th… pic.twitter.com/YxuPRxIgyw
— ANI (@ANI) January 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






