విమాన చార్జీలను మేము తగ్గించలేం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విమాన రంగంపై కేంద్రం డీరెగ్యులేషన్ అనేది ఆ రంగ అభివృద్ధికే దోహదపడుతుందని, ఈ సెక్టార్ ఇంకా వృద్ధిలోకి రావాలంటే, కంపెనీలు ముందుకు రావాలంటే విమాన సంస్థలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండాలన్నారు.
ఇండిగో సంక్షోభం దేశీయ విమానయాన రంగాన్నే ఓ కుదుపు కుదిపింది. ఇండిగో సంక్షోభం అనేది ఇతర ఎయిర్‌లైన్స్‌కు గుణపాఠం కావాలని, ఇంకోసారి ఇలాంటి సంక్షోభం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు హామీ ఇచ్చింది. మరోవైపు గత వారం నుంచి ఇండిగో సంక్షోభం మీద పార్లమెంట్‌లో చర్చ నడుస్తూనే ఉంది. ఇండిగో సంక్షోభం తర్వాత విమానయానం మీద దేశ ప్రజలకు కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమాన రంగం ప్రైవేటీకరణ వల్ల కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ సంస్థల విషయాల్లో జోక్యం తగ్గడం అనేది విమానయాన సంస్థలకు చాన్స్‌గా మారిందని, అందుకే వాళ్లకు నచ్చినట్లుగా విమాన చార్జీలను పెంచడం చేస్తున్నారని, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా విమాన ధరలు ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో ఇదే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దానిపై మాట్లాడిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన చార్జీల పెంపు లేదా తగ్గింపు అనేది తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు.
విమాన రంగం అభివృద్ధి చెందాలంటే మా జోక్యం ఉండకూడదు
విమాన రంగంపై కేంద్రం డీరెగ్యులేషన్ అనేది ఆ రంగ అభివృద్ధికే దోహదపడుతుందని, ఈ సెక్టార్ ఇంకా వృద్ధిలోకి రావాలంటే, కంపెనీలు ముందుకు రావాలంటే విమాన సంస్థలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండాలన్నారు. విమాన చార్జీలు సప్లయి, డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయని, డిమాండ్ ఎక్కువగా ఉంటే చార్జీలు పెరుగుతాయని, ఫెస్టివల్స్, ఇతర డిమాండ్ ఉన్న సీజన్లలో ఖచ్చితంగా విమాన చార్జీలు పెంచుతారని, వాటిని కేంద్రం రెగ్యులేట్ చేయడం కుదరదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

CM Revanth Reddy | పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి: సీఎం రేవంత్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



