త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి: సీఎం రేవంత్‌

CM Revanth Reddy | ర్ల‌మెంట్‌ (Parliament) త‌ర‌హాలో అసెంబ్లీ (Assembly) ప్రాంగణం ఉండాల‌ని.. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సోమ‌వారం నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో ఆయ‌న అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు.

S

News | Published On Apr 27, 2026, 2.43 pm IST

CM Revanth Reddy | పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి: సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: పార్ల‌మెంట్‌ (Parliament) త‌ర‌హాలో అసెంబ్లీ (Assembly) ప్రాంగణం ఉండాల‌ని.. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhendar Redyy), అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) సోమ‌వారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌డుతూ.. సభ గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స‌భ్యుల‌కు మరింత ప్రైవసీ ఉండేలా చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. పబ్లిక్ గార్డెన్ లో మెంబర్స్ కోసం క్లబ్ ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. దీంతో పాటు వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఏర్పాట్లు త‌గు రీతిలో ఉండాల‌ని పేర్కొన్నారు.

అసెంబ్లీ ప్రాంగ‌ణం అంతా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాల‌న్నారు. అలాగే హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. వీటితో పాటు అధికారులకు సీఎం రేవంత్ పలు సూచ‌న‌లు చేశారు.

Advertisement
Advertisement