Nitin Gadkari | గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. రోడ్డుకి అడ్డంగా నిలబడిన ప్రజలు.. వీడియో
Nitin Gadkari | కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తనిఖీలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Mumbai Expressway) పనులను మంత్రి గడ్కరి తనిఖీ (inspection) చేస్తున్నారు.
Nitin Gadkari | త్రినేత్ర.న్యూస్: కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తనిఖీలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Mumbai Expressway) పనులను మంత్రి గడ్కరి తనిఖీ (Inspection) చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ (Ratlam) జిల్లా మీదుగా సాగుతున్నది. ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై కాన్వాయ్‌లోని (Convoy) కార్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో హైవే చుట్టుపక్కల గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డుకు మధ్యలో కాన్వాయ్‌కి అడ్డుగా నిలబడ్డారు. పలువురు వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్నారు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు వారిని తప్పించి పక్కగా వెళ్లాయి. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మంత్రికి, గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఎక్స్‌ప్రెస్‌వే (Expressway) వల్ల తమకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ప్రజలు అలా చేశారని జిల్లా అధికారులు వెల్లడించారు. వారి పంటల మధ్యగా రోడ్డు వెళ్లడంతో.. ఇరువైపులా నీళ్లు నిలబడుతున్నాయని, దీంతో పంటలు మునిగిపోతున్నాయని చెప్పారు. ఇదే విషయమై మంత్రి గడ్కరిని గ్రామస్తులు (Villagers) కలవాలనుకున్నారని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటికే అధికారులకు వినపత్రం కూడా సమర్పించారని పేర్కొన్నారు. అయితే మంత్రి పర్యటన నేపథ్యంలో హైవేపై అక్కడక్కడ పోలీసులను మోహరించినప్పటికీ.. గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
A security lapse was reported during Union Minister Nitin Gadkari's convoy movement after villagers reportedly came onto the 8-lane highway. The incident could have led to a major accident, prompting questions over security arrangements.#NitinGadkari #SecurityBreach #RoadSafety… pic.twitter.com/e5P3dfUzJy
— IndiaToday (@IndiaToday) July 9, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Big Bash League | భారత్‌లోకి బిగ్ బాష్ లీగ్
- ●TGPSC | టౌన్‌ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్
- ●France vs Morocco | ఫ్రాన్స్ తీన్మార్!
- ●Mahalaxmi Rajayogam | త్వరలో సూర్య, గురువుల కలయిక.. మహాలక్ష్మీ రాజయోగంతో ఈ మూడు రాశులకు శుభయోగం..!
- ●Rythu Bharosa | నేడు తుది విడత రైతుభరోసా.. 9 నుంచి 50 ఎకరాల వరకు..
- ●Horoscope | జూలై 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం!

Big Bash League | భారత్‌లోకి బిగ్ బాష్ లీగ్

TGPSC | టౌన్‌ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్

France vs Morocco | ఫ్రాన్స్ తీన్మార్!

Mahalaxmi Rajayogam | త్వరలో సూర్య, గురువుల కలయిక.. మహాలక్ష్మీ రాజయోగంతో ఈ మూడు రాశులకు శుభయోగం..!






